Harish Rao | సిట్ చీఫ్ సజ్జనార్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు సీరియస్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారణలోనే ఉన్నప్పుడే ఇల్లీగల్ అని ఎలా తేల్చేశారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ ఇల్లిగల్ అవునా కాదా అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం నిర్ణయాంచాల్సి ఉంటుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ కొనసాగుతున్న దశలోనే దీనిని అక్రమంగా పేర్కొనడం చట్ట విరుద్ధమని హరీశ్‌రావు తెలిపారు. కానీ ఈ తరహా వ్యాఖ్యలు సిట్ చీఫ్ సజ్జనార్ చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చే వరకు ఏ ఆరోపణను కూడా నేరంగా పరిగణించకూడదన్నది స్థిరమైన న్యాయసూత్రమని ఆయన స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో భాగమైన డాక్టరిన్ ఆఫ్ ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నెసెన్స్ చెబుతుందని తెలిపారు. దర్యాప్తు చేయడమే పోలీసుల బాధ్యత తప్ప.. తీర్పు చెప్పే అధికారం వారికి లేదని వ్యాఖ్యానించారు..
ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా? కాదా అన్నది భారత టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5(2), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అలాగే పీయూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందో లేదో న్యాయస్థానమే నిర్ణయించాల్సి ఉంటుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కానీ కేసీఆర్ సిట్ విచారణ పూర్తయ్యిందని చేసిన అధికారిక ప్రకటనలోనే అక్రమమం అని తేల్చడం సరికాదని అన్నారు.
సిట్ చీఫ్ సజ్జనార్ వ్యాఖ్యలు దర్యాప్తు ఫలితంపై ముందస్తు అభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తున్నాయని హరీశ్‌రావు తెలిపారు. ఇది ఆలిండియా సర్వీసెస్ (కండక్ట్) రూల్స్ – 1968కు విరుద్ధమని అన్నారు. మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి రాజకీయంగా సున్నితమైన అంశంలో ఇలాంటి వ్యాఖ్యలు రావడం ద్వారా దర్యాప్తులో నిష్పక్షపాతత్వంపై అనుమానాలను కలిగిస్తున్నాయని తెలిపారు. దర్యాప్తు న్యాయబద్ధంగా ఉండటమే కాకుండా న్యాయంగా కనిపించాలని సుప్రీంకోర్టు పదే పదే చెబుతుందని గుర్తుచేశారు. విచారణకు ముందే తప్పు జరిగిందనే భావన కలిగించేలా చేసిన ప్రకటనలు ప్రజలకు న్యాయవ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. పోలీస్ కమ్యూనికేషన్లను రాజకీయ కథనాలను బలపరిచేందుకు ఉపయోగించరాదని స్పష్టం చేశారు.
దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా, వృత్తిపరంగా చట్ట పరిధిలోకి లోబడే పనిచేయాలని హరీశ్‌రావు సూచించారు. పోలీసుల ప్రకటనల ద్వారా కాకుండా తీర్పులను కోర్టులు ఇవ్వాలని అన్నారు. రాజ్యాంగ పరిమితులను దర్యాప్తు సంస్థలు విస్మరిస్తే ప్రజాస్వామ్యం నిలవదని హెచ్చరించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ను సీట్ చీఫ్ ఎందుకు గుర్తించడం లేదని ఆయన ప్రశ్నించారు.
How a SIT chief @SajjanarVC can officially refer to the issue of phone tapping as “illegal” even before the matter has been examined and decided by a competent court of law.
Such a statement is not only legally unsustainable but also deeply disturbing coming from SIT chief.
— Harish Rao Thanneeru (@BRSHarish) February 2, 2026