అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్‌పై హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఇది BRS సస్పెన్షన్ కాదు.. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సస్పెన్షన్ అని విమర్శించారు. ప్రజలు “మా సమస్య గురించి మాట్లాడండి” అంటుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం BRSని బయటకు పంపండి అంటున్నాడని అన్నారు.
నియంతృత్వం ఎంత పెరిగితే.. ప్రజా తిరుగుబాటు అంత బలపడుతుంది అన్న విషయం గుర్తుంచుకో రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు హెచ్చరించారు.
మహిళా ఎమ్మెల్యేలపై దాడి ఘటనలపై నిలదీసినందుకు సభ నుంచి సస్పెన్షన్ వేటు వేసింది. 17 మంది బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. ఈ సెషన్ ముగిసేంత వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతోందని తీర్మానం చేశారు. దీనిపై స్పీకర్‌ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్దమయ్యారు. ఈ క్రమంలో స్పీకర్ అపాయింట్మెంట్ కోసం ప్రతిపక్ష నేత చాంబర్లో ఎదురుచూస్తున్నారు.