రేవంత్.. ఎంతమందిని బలిగొంటావ్!
‘రేవంత్‌రెడ్డీ.. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం గడుపుతావు. ఇలా ఎంతమందిని బలి తీసుకుంటావు?’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రిని నిలదీశారు.
- మీరు మాట తప్పడం వల్లే శంకర్‌గౌడ్ ఆత్మ బలిదానం
- ఆయన మరణించిన రోజే అపాయింటెడ్ డేగా ప్రకటించాలి
- కార్మికుల సమస్యలు తక్షణమే తీర్చాలి: హరీశ్‌రావు డిమాండ్
హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ‘రేవంత్‌రెడ్డీ.. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం గడుపుతావు. ఇలా ఎంతమందిని బలి తీసుకుంటావు?’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రిని నిలదీశారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తిచేస్తామని, వాటితోపాటు ఇతర అన్ని సమస్యలు పరిషరిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక మాట తప్పినందునే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారని ఒక ప్రకటనలో తెలిపారు. శంకర్‌గౌడ్ మృతికి సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. శంకర్‌గౌడ్ మరణం హృదయాన్ని కలిచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. హకుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలే తప్ప, ఇలాంటి ఆత్మబలిదానాలకు ఎవరూ ఒడిగట్టవద్దని హితవు పలికారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాలని, ప్రభుత్వం తక్షణమే సమస్యల పరిషారానికి చర్యలు జరిపి కార్మికుల్లో విశ్వాసం కల్పించాలని డిమాండ్ చేశారు. శంకర్‌గౌడ్ అమరుడైన రోజున ‘అపాయింటెడ్ డే’గా ప్రకటించి, ఆయన త్యాగానికి తగిన గౌరవం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘మీ పోరాటానికి మేమంతా అండగా ఉన్నాం. అధైర్యానికి లోనుకాకండి. ఐక్యంగా పోరాడి హకులను సాధించుకుందాం. ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దు’ అని ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

