Harish Rao | రేవంత్‌రెడ్డి.. దరఖాస్తుల పేరిట ప్రజలను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారు?.. హరీశ్‌రావు ఫైర్
రేషన్ కార్డులకు మీసేవా దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ పార్టీ మరోసారి దగా చేస్తున్నదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుల పేరిరు ప్రజలను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నరు. కుల గణనలో వివరాలు తీసుకున్నరు.
హైదరాబాద్: రేషన్ కార్డులకు మీసేవా దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ పార్టీ మరోసారి దగా చేస్తున్నదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుల పేరిరు ప్రజలను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నరు. కుల గణనలో వివరాలు తీసుకున్నరు. గ్రామ సభల పేరుతో డ్రామా చేశారు. ఇప్పుడు మల్లా మీసేవలో దరఖాస్తులు అంటున్నరు. పథకాల పేరిట ఇన్నాళ్లు మీరు చేసిన హడావుడి స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేసిన గారడీ నేనా అంటూ మండిపడ్డారు.
ప్రజా పాలన, గ్రామ సభల దరఖాస్తులకు విలువ లేదా అని నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలో దరఖాస్తు లేకుండా, దస్త్రం లేకుండా తెలంగాణలో పథకాల అమలు జరిగింది. కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు అంటూ మోసం చేస్తున్నారు. జనాల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. పేదలకు రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందించాలనే ఆలోచన కంటే, కోతలు పెట్టి ఎలా అందకుండా చేయలన్న దానిపైనే మీ ప్రభుత్వ దృష్టి ఉందంటూ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప, 14 నెలల పాలనలో మీరు చేసిందేముందని ధ్వజమెత్తారు. దరఖాస్తుల పేరిట కాలం వెళ్లదీయడం మానేసి, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు, ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేసి, నిరుపేదలకు, రైతులకు బాసటగా నిలంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
దరఖాస్తుల పేరిట ఇంకెన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారు రేవంత్ రెడ్డి?
ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నరు.
కుల గణనలో వివరాలు తీసుకున్నరు.
గ్రామ సభల పేరిట డ్రామా చేశారు.
ఇప్పుడు మల్లా మీసేవలో దరఖాస్తులు అంటున్నరు.పథకాల పేరిట ఇన్నాళ్లు మీరు చేసిన హడావుడి స్థానిక సంస్థల ఎన్నికల… pic.twitter.com/PsZin1po6M
— Harish Rao Thanneeru (@BRSHarish) February 8, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- aplications
- BRS
- Congress
- harish rao
RELATED ARTICLES
తాజా వార్తలు
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

