హైదరాబాద్: 24 గంటల కరెంటు విషయంలో దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్న జాతీయ కాంగ్రెస్ వైఖరిపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. నవ్విపోదురు గాక, నాకేం సిగ్గు అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ తీరు ఉన్నదని ఎద్దేవా చేశారు. దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటును అందించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అని చెప్పారు. 2018, జనవరి 1 నుంచే రాష్ట్రంలో అన్నదాతలకు 24 గంటల ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. కానీ, ఆ ఘనత కూడా తమదేనంటూ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శిచారు.
గతంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు దండగ అని, మూడు గంటల కరెంటు సరిపోతుందని రైతు వ్యతిరేక వైఖరిని ప్రకటించిన చరిత్ర రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు. ఇప్పుడేమో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఓట్ల కోసం కేసీఆర్ అందించిన 24 గంటల ఉచిత కరెంటు ఘనతను తమ ఖాతాలో వేసుకుంటూ దేశవ్యాప్తంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సాధించిన అభివృద్ధిని చూపించుకునే ముఖం లేక, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ సాధించిన అభివృద్ధిని చూపించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి, మోసపూరిత విధానానికి మరో నిదర్శనమని చెప్పారు.
Congress Misleading Saga:
Boasting about ‘free electricity for farmers’ is just their election tactic.However, it was KCR garu’s @BRSparty government has been providing 24/7 free power to Telangana’s farmers since January 1, 2018.
Ironically, @revanth_anumula previously… https://t.co/5E1RoDeYMg pic.twitter.com/pxdtNOvJW7
— Harish Rao Thanneeru (@BRSHarish) November 4, 2024