గజ్వేల్: కాంగ్రెస్ నేతలు ఈ ఆరు నెలల్లో గాడిద గుడ్డు తప్ప ఏమిచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సమయానికి రైతుబంధు ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో మోటర్లు కాలిపోతున్నాయన్నారు. రైతులు, మహిళలు, పేదలందరినీ కాంగ్రెస్ మోసం చేసిందని చెప్పారు. కల్యాణలక్ష్మి కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా గజ్వేల్ పట్టణంలో హరీశ్ రావు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలకు బంగారం ఇవ్వడం ఏమోకానీ బంగారం ధరలు కొండెక్కాయన్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్ బంద్ అయ్యిందని విమర్శించారు.
బీజేపీకి ఓటు వేస్తే నీళ్లు లేని బావిలో పడినట్లవుతుందని చెప్పారు. అది పేదల వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. గజ్వేల్‌లో ఏ ముఖం పెట్టుకుని బీజేపీ వాళ్లు ఓట్లు అడుతున్నారని ప్రశ్నించారు. గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకున్న వారికి ఎలా ఓట్లు వేస్తారని చెప్పారు. దుబ్బాకలో చెల్లని రూపాయి.. ఇక్కడ చెల్లుతుందా అని ఎద్దేవా చేశారు.
LIVE : Former Minister, MLA @BRSHarish addressing the public at a roadshow in Gajwel.
#VoteForCar #LokSabhaElections2024 https://t.co/5uikypxvL1
— BRS Party (@BRSparty) May 11, 2024