KTR | అసెంబ్లీ శీతాకాల సమావేశాల వేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటూ కాకుండా పోయారని విమర్శించారు. వారు ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేకపోతున్నారని అన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్లో డోర్స్ క్లోజ్ అయ్యాయని స్పష్టం చేశారు.
ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారికి అవకాశమిస్తామని కేటీఆర్ తెలిపారు. గ్రౌండ్లో బీఆర్ఎస్కు మంచి పట్టు ఉందని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 40 శాతం ఫలితాలు వచ్చాయని గుర్తుచేశారు.