Telangana Assembly | పెండింగ్ పనులను పూర్తి చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..భీంగల్ వంద పడకల ఆస్పత్రి తమ హయాంలోనే మంజూరైందని తెలిపారు. దాదాపు 85 శాతం పనులు కూడా పూర్తయ్యాయని పేర్కొన్నారు.రూ.5 కోట్లు విడుదల చేస్తే మిగిలిన పనులు పూర్తవుతాయని చెప్పారు. నిధులు విడుదల చేసి పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని వేముల డిమాండ్ చేశారు.