సిద్దిపేట: ప్రజల భాగస్వామ్యం లేనిదే అనుకున్న లక్ష్యం నెరవేరడం సాధ్యం కాదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ప్రజలను కాపాడుతున్న సఫాయి అన్నాలకు సలాం చెబుతున్నానని తెలిపారు. సిద్దిపేటకు ఇప్పటివరకు 22 అవార్డులు వచ్చాయని చెప్పారు. సిద్దిపేట మున్సిపాలిటీకి స్వచ్ఛసర్వేక్షన్లో దక్షిణ భారతదేశంలోనే క్లీన్సిటీ అవార్డు వచ్చిన సందర్భంగా మున్సిపల్ కార్మికులను హరీశ్ రావు సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. క్లీన్ సిటీ అవార్డు సిద్దిపేట ప్రజలకు అంకితమన్నారు.
ఒకే మున్సిపాలిటీకి జాతీయస్థాయి అవార్డు వస్తే ప్రభుత్వం నుంచి అభినందనలు తెలుపని పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నదని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో ఎక్కడ అవార్డు వచ్చినా అభినందించే సంస్కృతి ఉండేదని వెల్లడించారు. ప్రజల ఆశీస్సులు తమకు ఉన్నాయని, ప్రజల వైపు నడుద్దామని తెలిపారు.