హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ):‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిం ది.. రైతన్నకు కన్నీటి గోస తెచ్చింది’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పంట పొలాలకు సాగునీటి కోసం అన్నదాతలు రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని సోమవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా సూర్యాపేటలోనే రైతన్నలు నీటి కోసం రెడ్డెక్కారని తెలిపారు.
యాసంగి సాగు నీటి విడుదల షెడ్యూల్ పేరిట రూ.కోట్ల ప్రజాధనం వెచ్చించి ప్రకటనలు ఇచ్చారని, ఎస్సారెస్పీ స్టేజ్-2లో భాగంగా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ తదితర నియోజకవర్గాల్లోని 3,36,639 ఎకరాలకు సాగునీటిని విడుదలచేస్తామని పేర్కొన్నారని గుర్తుచేశారు. ప్రచారం చేసుకున్నారు కానీ, పంట పొలాలకు నీళ్లు విడుదలచేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నీటిపారుదల శాఖ మంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా రైతుల పరిస్థితేమిటని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. అద్భుతాలు చేస్తున్నట్టు భ్రమలు కల్పించడం మానేసి ఇప్పటికైనా ఆచరణకు దిగాలని హితవు పలికారు. రాజకీయ కక్షలు మానేసి పంట పొలాలకు నీళ్లందించాలని కోరారు.
ఉద్యోగులకు మొదటి తేదీనే జీతాలు చెల్లిస్తున్నామంటున్న సీఎం, మంత్రుల మాటలు నేతి బీరకాయలో నెయ్యి చం దంగా ఉన్నాయని హరీశ్‌రావు దుయ్యబట్టారు. మహిళా కమిషన్ సభ్యులకు ఏడా ది నుంచి జీతాలు ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. గత సంవత్సరం నుం చి వారికి జీతాలు ఇవ్వడంలేదని తెలిపారు.
బడ్జెట్లో మహిళా కమిషన్‌కు రూ.2. 42 కోట్లు కేటాయించినప్పటికీ, విడుదల చేసింది మాత్రం రూ.20 లక్షలకు మించలేదని పేర్కొన్నారు. న్యాయమూర్తులతో సమానంగా వ్యవహరించే మహిళా కమిషన్ సభ్యులకే జీతాలు చెల్లించకపోతే, ప్రభుత్వం సామాన్య మహిళల హక్కులను ఏ విధంగా కాపాడుతుందని నిలదీశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదలచేయాలని, మొదటి తారీఖునే మహిళా కమిషన్ సభ్యులకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు.