Harish Rao | జగదీశ్‌రెడ్డి అంశంపై అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. జగదీశ్‌రెడ్డి స్పీకర్ అవమానించలేదన్నారు. ‘సభ మీ ఒక్కరిది కాదు.. సభ అందరి అన్నారు’ అన్నారు. ‘మీ’ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదన్నారు. ‘మీ ఒక్కరిదీ’ అనే పదం అన్ పార్లమెంట్ పదం కాదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తనకు తెలియదన్నారు. సభను ఎందుకు వాయిదా వేశారో తెలీదన్నారు. కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడి ఇలా వ్యవహరిస్తోందన్నారు. స్పీకర్‌ను కలిశామని.. రికార్డు తీయాలని అడిగామన్నారు. అగౌరవ పరిచేలా జగదీశ్‌రెడ్డి మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్ సభ్యుడు సభలో మాట్లాడిన వీడియో రికార్డు కావాలని స్పీకర్ అడిగామన్నారు. 15 నిమిషాల అయినా వీడియో రికార్డు స్పీకర్ తెప్పించలేదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ఎస్ ఎమ్మెల్యేలను మాట్లాకుండా బ్లాక్ చేశారని మండిపడ్డారు.