జనగామ : రైతుల రుణమాఫీ విషయంతో సీఎం రేవంత్ రెడ్డి నిజ స్వరూపం బయట పడింది. మోసం రేవంత్ రెడ్డిది, పాపం కాంగ్రెస్ పార్టీది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. గురువారం జనగామ(Janagama )జిల్లా కేంద్రంలో రుణమాఫీపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో(Farmers dharna) పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న మీద ఓట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నడు.
ఏ ఊర్లో నైనా వంద శాతం రుణమాఫీ అయిందా? అని ప్రశ్నించారు. ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ మంత్రులే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. రుణమాఫీ మొత్తం కాలేదని, తెలంగాణ ప్రజలను కాపాడాలని యాదగిరిగుట్ట నర్సింహ స్వామిని వేడుకున్నాని చెప్పారు. ఆగస్టు నెల వచ్చినా ఊర్లల్లో చెరువులు నింపడం లేదు. రైతుబీమా, రైతుబంధు ఇచ్చి చెరువులు నింపిన ఘనత కేసీఆర్‌ది అన్నారు.
జాబ్ క్యాలెండర్ ఏమైంది? రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని నిలదీశారు. అసెంబ్లీలో చర్చకు రేవంత్ రెడ్డి భయపడ్డాడని ఎద్దేవా చేశారు. అలాగే పోలీసులను హెచ్చరిస్తున్న మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చీఫ్ సెక్రటరీ మెడలు వంచైనా సరే రుణమాఫీ చేయిస్తాం. ఆయన వెంట ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.