సిద్దిపేట : కులం, మతం, జాతి విభేదాలు లేకుండా సమసమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న(Sarvai Papanna) అని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) అన్నారు. పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాపన్న గౌడ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ లెక్క జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. 17వ శతాబ్దంలో బహుజన రాజుగా చరిత్రలో నిలిచారు.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతిలను రాష్ట్ర ప్రభుత్వం అధికా రికంగా చేయాలని నిర్ణయించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గీతా కార్మికులకు చెట్టు పన్నులు రద్దు, సొసై టీలను పునరుద్ధరణ, వైన్స్ షాప్స్ లో 15 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అనేక కార్యక్రమాలు గౌడ సంక్షేమం కోసం చేపట్టారన్నారు. పది ఏండ్ల కేసీఆర్ హయాంలో ఎక్కడ ఏ కల్లు డిపో మీద అక్రమ కేసులు, ఆబ్కారీ శాఖ వేధింపులు గాని దాడులు లేవని గుర్తు చేశారు.
పెద్ద ఎత్తున ఈత వనాలను పెంచే కార్యక్రమం చేపట్టాం. గీతా కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి పడిపోతే ప్రమాద బీమా ఇచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కల్లు డిపోల మీద దాడులు, అక్రమ కేసులు పెట్టి గీతా కార్మికులను వేధించడం దురదృష్టకరమన్నారు. తక్షణమే ఆబ్కారీ అధికారులు గీతా కార్మికులను వేధించడం మానుకోవాలని డిమాండ్ చేశారు.