హైదరాబాద్: రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నది. ఓ వైపు ప్రజా పాలన ఉత్సవాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ సర్కార్.. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నది. ఎమ్మెల్యేలు, నేతల అక్రమల అరెస్టులకు నిరసనగా ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్సీలు కవిత, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, పద్మారావు గౌడ్, కేపీ వివేకానంద, డాక్టర్ సంజయ్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను హౌస్ అరెస్టు (House Arrest) చేశారు.
కోకాపేటలోని హరీశ్‌రావు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన బయటకి వెళ్లనీయకుండా గృహ నిర్బంధం చేశారు. దీంతో పోలీసులతో హరీశ్‌రావు వాగ్వాదానికి దిగారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు నివాళులు అర్పించేందుకు వెళ్లకుండా ఈ నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు. ఇక శుక్రవారం ఉదయం నుంచే ఎమ్మెల్సీ కవిత ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఆమెను ఇంట్లో నుంచి బయటకు రాకుండా చూస్తున్నారు. ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును హౌస్ అరెస్టు చేసిన పోలీసులు.. వారి నివాసాల వద్ద భారీగా మోహరించారు.
ఎమ్మెల్సీ కవిత హౌస్ అరెస్ట్
కవిత ఇంటి ముందు మోహరించిన పోలీసులు https://t.co/ZVWITSdRqA pic.twitter.com/PsCTLe85i0
— Telugu Scribe (@TeluguScribe) December 6, 2024
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల హౌస్ అరెస్ట్
మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, డాక్టర్ సంజయ్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు pic.twitter.com/0TKcyOgd8g
— Telugu Scribe (@TeluguScribe) December 6, 2024