Harish Rao | లంకె బిందెల కోసమే పురాతమైన ఆలయాలను కూల్చివేస్తున్నారు : హరీశ్ రావు
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డికి కూల్చడం తప్ప కట్టడం రాదని శాసనసభ విపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
హైదరాబాద్ : లంకెబిందెల కోసమే పురాతమైన ఆలయాలను కూల్చివేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కూల్చడం తప్ప కట్టడం రాదని శాసనసభ విపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. వరంగల్ జిల్లా ఖానపురం మండలం అశోక్ నగర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిన 800 ఏండ్ల చారిత్రక కాకతీయ కట్టడం శివాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గుప్త నిధుల కోసం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు. స్కూల్ నిర్మాణం కోసం అయితే అర్ధరాత్రి తవ్వకాలు ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు.
గర్భగుడి కింద 24 అడుగుల లోతు తవ్వాకాలు చేపట్టారని పురావస్తు శాఖ తేల్చింది. ఆలయాల కూల్చివేతపై ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుంత్వం రాగానే దేవాదాయ శాఖ భూమి ప్రభుత్వ భూమిగా మారిందన్నారు. గుప్త నిధుల వేటలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారన్నారు. పేదల ఇళ్లతో పాటు గుళ్లను కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో వరంగల్ జిల్లాలో ఎన్నో ఆలయాలను పునరద్ధరించాం.
రామప్ప ఆలయానికి బీఆర్ఎస్ యునెస్కో గుర్తింపు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ధ్వంసం చేసిన శివాలయాన్ని పునర్మిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సూదర్శన్ రెడ్డి, దాస్యం వినయ భాస్కర్, అరూరి రమేష్, శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

