హైదరాబాద్, జూన్ 7(నమస్తే తెలంగాణ): తెలంగాణ జలధార కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని మాజీమంత్రి హరీశ్‌రావు శనివారం రుజువులు సహా పటాపంచలు చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో ఉమ్మడి రాష్ట్ర పాలనలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కాగ్ నివేదిక సాక్షిగా ఎండగట్టారు. తొలుత తుమ్మిడిహట్టి వద్దనే ప్రాజెక్టు నిర్మాణం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు రీ-ఇంజినీరింగ్ చేయాల్సి వచ్చిందో తెలిపే కారణాలను సవివరంగా తెలియజేస్తూనే ఇందుకు సంబంధించి సీడబ్ల్యూసీ చేసిన సూచనల కాపీని ఆయన బయటపెట్టారు. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ స్వయంగా మేడిగడ్డను ఎంపిక చేసిన విషయాన్ని ఆధారాలు సహా వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన సూచనలు, కేంద్రప్రభుత్వం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు లభించిన అన్ని అనుమతులను జీవోలు సహా బయటపెట్టారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విష ప్రచారమంతా ఉత్తదేనని తేలిపోయింది.
ప్రాణహిత-చేవెళ్లలో కాంగ్రెస్ దోపిడీ ‘హస్తం’
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో తట్టెడు మట్టి కూడా ఎత్తకుండానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట రూ. 1,052.59 కోట్లను పక్కదారిపట్టించింది. 2012లో జలయజ్ఞం పేరిట ఈ విషయాన్ని తెలియజేస్తూ కాగ్ బయటపెట్టిన నివేదిక.
ప్రాణహిత-చేవెళ్లపై కాంగ్రెస్ అబద్ధాల దండకం
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 17,875 కోట్ల నుంచి రూ. 38,500 కోట్లకు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. అంతేకాదు, ఏడేండ్లలో ఈ ప్రాజెక్టు కోసం రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసినం అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నదీ అబద్ధమే. భూసేకరణ, ఇతర అన్ని పనులకు వాళ్లు 7 ఏండ్లలో చేసిన ఖర్చు రూ. 3,780 కోట్లు మాత్రమే. దీనికి సంబంధించిన రుజువులు ఇవిగో..
—రీ-ఇంజినీరింగ్ ఎందుకంటే? —
నీటి లభ్యత లేకపోవడం
హైడ్రాలజీ విభాగం లెక్కల ప్రకారం.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అవసరాలకు తగినన్ని నికర జలాలు లేవని, కాబట్టి ప్రాజెక్టుపై పునరాలోచన చేయాలని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) చేసిన సూచనలు .
రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో తగినంత నిల్వ సామర్థ్యం కలిగినబరాజ్లు లేవంటూ 2.07.2008న సీడబ్ల్యూసీ చేసిన సూచనలు
మేడిగడ్డను ఎంపిక చేసిన వ్యాప్కోస్
ప్రాజెక్టు నిర్మాణానికి తుమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయంగా మేడిగడ్డను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్
క్యాబినెట్ సబ్-కమిటీ రిపోర్ట్
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాలని అప్పటి మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్రావు తో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్టు
కాళేశ్వరం సమగ్ర స్వరూపం
రిజర్వాయర్/బరాజ్‌ల సామర్థ్యం (టీఎంసీలు)
కాళేశ్వరం నీళ్లతో జరిగిన సాగు..వివరాలు
కొత్త ఆయకట్టు
తెలంగాణకు గోదారి జలాలే ఎందుకు కావాలె?
రీ- ఇంజినీరింగ్‌తో గోదావరి సజీవం..
6..సాగునీటి రంగంలో బీఆర్ఎస్ కృషి-ప్రయోజనాలు
ధాన్యం ఉత్పత్తి
అన్ని రకాల పంటల దిగుబడి
సాగు విస్తీర్ణం
చేపల ఉత్పత్తి
భూగర్భజలాల పెరుగుదల.. 5.36 మీటర్లు
నదిలేని చోట జలాశయాలు ఉన్న ప్రాంతాలు(ఏపీలో)