Harish Rao | హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసుల హడావుడిని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీశ్‌రావును అదుపులోకి తీసుకునే విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అక్కడ ఎలాంటి ఆందోళన జరగకున్నా, కార్యకర్తలు హడావుడి చేయకపోయినా.. పోలీసులు దూకుడుగా ప్రవర్తించారు. సాక్షాత్తూ ఓ కానిస్టేబుల్ హరీశ్‌రావు పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ‘చేసిన ఓవరాక్షన్ చాలు.. తమషాలు చేస్తున్నారా? ఇప్పటి వరకు చేసింది చాలు. స్టేషన్‌కు నడవండి’ అంటూ అమర్యాదగా ప్రవర్తించాడు. అలా అనడం మర్యాదకాదని చెప్పాల్సిన సీఐ సైతం వారించకుండా చూస్తుండిపోయారు.
కానిస్టేబుల్ వైఖరిపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఓ కానిస్టేబుల్‌గా మీరు అలా మాట్లాడొచ్చా? మాజీ మంత్రినైన నన్ను ఇప్పటివరకు చేసింది చాలని అంటారా? ఇదేం విధానం?’ అంటూ ఆయన వైఖరిని తీవ్రంగా నిరసించారు. దీంతో పోలీసులకు హరీశ్‌రావుకు వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ క్రమంలో హరీశ్‌రావును పెడరెక్కలు పట్టి బలవంతంగా కారులోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. అంతకు ముందు కౌశిక్‌రెడ్డి ఇంటి నుంచి మాజీ మంత్రి అనే కనీస మర్యాద లేకుండా హరీశ్‌రావును రెక్కలు పట్టుకొని బలవంతంగా కిందికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో హరీశ్‌రావును వాహనంలోకి ఎక్కిస్తున్న క్రమంలో తననెందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని హరీశ్‌రావు ప్రశ్నించారు. పోలీసుల దగ్గర సమాధానం లేక, బలవంతంగా హరీశ్‌రావును పోలీసు వ్యానులోకి నెట్టి, నేరుగా గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో సుమారు పది గంటల వరకు హరీశ్‌రావు గచ్చిబౌలి పోలీసు స్టేషన్లోనే ఉంచారు.
అరెస్ట్ అయింది వీరే..మాజీ మంత్రులు
హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, నిరంజన్ రెడ్డి, మహమూద్ అలీ
ఎమ్మెల్సీలు
శంభీర్‌పూర్ రాజు, తాతా మధు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
ఎమ్మెల్యేలు
కౌశిక్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి,
మాజీ ఎమ్మెల్యేలు
మర్రి జనార్దన్‌రెడ్డి, జాజుల సురేందర్, శంకర్‌నాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి
మహిళా నేతలు
సుమిత్రా ఆనంద్, రజితారెడ్డి, సుశీలారెడ్డి
కార్పొరేషన్ మాజీ చైర్మన్లు
పల్లె రవికుమార్ గౌడ్, దేవీప్రసాద్, మెడె రాజీవ్‌సాగర్
ప్రజాప్రతినిధులు
తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి, మెదక్ డీసీసీబీ వైస్ చైర్మన్, పట్నం మాణిక్యం
కార్పొరేటర్లు
మెట్టుకుమార్ యాదవ్, దయాకర్‌రెడ్డి వెల్మల
ఉస్మాన్‌నగర్ కౌన్సిలర్లు
రవీందర్‌రెడ్డి, కీర్తిలత, బొమ్మెర రామ్మూర్తి, తుంగబాలు, గజ్జెల నగేశ్,
బీఆర్ఎస్ నేతలు
ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, ఏ రాకేశ్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్, కురువ విజయ్‌కుమార్, వై.సంతోష్‌రెడ్డి,ఎల్లారెడ్డి, అద్నాన్, చంద్రశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ నేత కార్తీక్, అరవింద్, నాగరాజు