మెదక్: రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి పనితీరు ఉందని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) వివమర్శించారు. ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే, రేవంత్ రెడ్డి ఏమో మూసీ సుందరీకరణ, ఒలింపిక్స్ ఆటల పోటీల మీద రివ్యూలు చేస్తున్నడని మండిపడ్డారు. నిన్న ఒక మంత్రి హెలికాప్టర్‌ను అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలని అంటున్నాడు.. వాళ్లేమో పెళ్ళికి, బీహార్‌లో రాజకీయాలకు వాడుతారని దుయ్యబట్టారు. మెదక్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో హరీశ్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం పర్యటించింది. రాజాపేట గ్రామంలో వరదలో చిక్కుకొని చనిపోయిన సత్యం కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘మెదక్ జిల్లా రాజాపేట వరదల్లో చిక్కుకొని ఇద్దరు కరెంటు పోల్ ఎక్కి నాలుగైదు గంటలపాటు సహాయం కోసం ఎదురు చూశారు. జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగానికి సమాచారమిచ్చినా వారు పట్టించుకోలేదు.. మధ్యాహ్నం కరెంట్ పోల్ కూడా కొట్టుకుపోవడంతో వారు చనిపోయారు. హెలికాప్టర్ పంపించి ఉంటే వాళ్లు ప్రాణాలతో దక్కేవారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే.
చనిపోయిన రెండు కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సహాయం చేయాలి. నష్టపోయిన పంట పొలాలకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలి. మెదక్ ముంపు ప్రాంతాలకు ప్రజలు సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారు. తాగునీరు లేకపోవడంతో వర్షం నీరు తాగుతున్నారు. ధూప్ సింగ్ తాండా ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని’ హరీశ్ రావు డిమాండ్ చేశారు.
రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లు ఉంది రేవంత్ రెడ్డి తీరు 😡
భారీ వర్షాలతో ఒక దిక్కు ప్రజల ప్రాణాలు పోతుంటే..
రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని నిన్న మూసీ సుందరీకరణ మీద,
ఇవ్వాళ పొద్దున లేచి ఆటల పోటీల మీద రివ్యూ నిర్వహిస్తున్నడు.వరద ప్రభావిత ప్రాంతాల్లో… pic.twitter.com/p3j6GGLdW8
— BRS Party (@BRSparty) August 28, 2025