Harish Rao | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ‘మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం.. పాలనా వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడం..పూటకో మాట చెప్తూ ప్రజలను మోసం చెయ్యడం సీఎం రేవంత్‌రెడ్డి నైజం’ అంటూ మాజీ మంత్రి హరీశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ కూతురు పెండ్లికి దుబాయ్ వెళ్లిన తనపై విలసాలు, విందులకోసం వెళ్లానని అభాండాలు వేయడం ఆయన నీచత్వానికి పరాకాష్ట అని నిప్పులు చెరిగారు. ‘రేవంత్‌రెడ్డి ఎస్ఎల్బీసీ ప్రమాదస్థలానికి వెళ్లకుండా ఓట్లకోసం హెలికాప్టర్లో ప్రచారానికి పోయింది వాస్తవం కాదా? హెలికాప్టర్ లేదనే కారణంతో నీటిపారుదల శాఖ మంత్రి ఘటనా స్థలానికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నది నిజం కాదా?’ అంటూ ఆదివారం ఎక్స్ వేదికగా ప్రశ్నాస్ర్తాలు సంధించారు.
బాధ్యత మరిచిన ముఖ్యమంత్రి, మంత్రులు తనపై, బీఆర్ఎస్పై బురద జల్లడం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. ‘ప్రమా దం జరిగింది ఫిబ్రవరి 22న.. నేను అంతకు ముందు రోజే దుబాయ్ వెళ్లిన. తోటి ఎమ్మెల్యే కూతురు వివాహానికి కుటుంబసమేతంగా హాజరైన నన్ను ఆడిపోసుకోవడం బాధాకరం. తక్షణ కర్తవ్యాన్ని విస్మరించిన ముఖ్యమంత్రి 9 రోజుల తర్వాత ప్రమాద ప్రాంతానికి పోయి రాజకీయాలు మాట్లాడి కుత్సిత బుద్ధిని బయటపెట్టుకున్నరు’ అంటూ నిప్పులు చెరిగారు.
ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా నిర్మాణాత్మకంగా వ్యహరించానని హరీశ్ చెప్పారు. ప్రభుత్వానికి ఐదు రోజుల సమయం ఇచ్చిన తర్వాతే సొరంగం వద్దకు తాను వెళ్లానని పే ర్కొన్నారు. కానీ రేవంత్ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు నోటికొచ్చినట్టు వాగుతూ బీఆర్ఎస్పై నెపంనెట్టేందుకు యత్నించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రమాదం జరిగి 9 రోజులైనా కార్మికుల ప్రాణాలను కాపాడడం లో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
సీఎం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టుల గురించే కాదు.. ఏ ఒక్క ప్రాజెక్టు గురించీ మాట్లాడే నైతిక హకు లేదని హరీశ్ మండిపడ్డారు. ‘68 శాతం కృష్ణా పరీవాహక ప్రాంతం ఉన్న తెలంగాణ, 60 ఏండ్లపాటు కృష్ణా జలాలు దకక అలమటించిందంటే అది ఎవరి పాపం? బంగారం పండే నల్లరేగడి భూములున్న పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చిన వంచకులు మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కదా?’ అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే బా బుకు ఊడిగం చేసిన రేవంత్.. ఇప్పుడు బాబు ను నొప్పించకుండా కృష్ణాజిల్లాల గురించి మాట్లాడాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చేతనైతే కృష్ణ నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని హితవుపలికారు. ఆదివా రం ఈ మేరకు హరీశ్ ప్రకటన విడుదల చేశా రు. రేవంత్‌రెడ్డి ఎకడికి పోయినా కేసీఆర్‌ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్కటి కూ డా మాట్లాడటం లేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ మంజూరు చేసిన ప్రాజెక్టులను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని రేవంత్ అనడం జోక్ ఆఫ్ ద మిలీనియమని హరీశ్ అభివర్ణించా రు.‘ఏది పడితే అది అనగల సమర్థులు మీరు. జలయజ్ఞం ధనయజ్ఞమని మాట్లాడింది మీ నో రే కదా? శిలాఫలకాలు వేసి, కొబ్బరికాయలు కొట్టి అడ్వాన్సులు దండుకొని, కనీసం భూసేకరణ కూడా పూర్తిచేయని దగాకోరు చరిత్ర కాం గ్రెస్‌ది. కాంగ్రెస్ హయాంలో నత్తనడక నడిచి న పనులను పరుగెత్తించి పూర్తి చేసింది బీఆర్ఎస్. ఇది పాలమూరులో ఏ రైతును అడిగినా చెప్తరు. ప్రాజెక్టుల పేరిట డబ్బులు దండుకోవడానికి ఈపీసీ విధానం తెచ్చి దోచుకున్నది కాం గ్రెస్ నాయకులు. ఆనాడు తెలుగుదేశం నాయకుడిగా జలయజ్ఞం అవినీతి బాగోతాల గురించి నువ్వే మాట్లాడిన మాటలు మర్చిపోయినవా?’ అని రేవంత్‌ను హరీశ్ నిలదీశారు.
కృష్ణా బేసిన్లో నీటిని నిల్వ చేసుకునే సా మర్థ్యం లేదంటే ఆ పాపం కాంగ్రెస్‌దేనని హరీశ్ విమర్శించారు. ‘ఎత్తిపోతల పథకాల్లో ఎకడా ఒక పెద్ద రిజర్వాయర్ కూడా మీరు ప్రతిపాదించలేదు. కృష్ణాబేసిన్‌లో అన్ని ప్రాజెక్టుల్లో కలిపి కనీసం 20 టీఎంసీల నిల్వ కూడా ఏర్పాటు చేయలేదు. కానీ, బీఆర్ఎస్ ఒక పాలమూరులోనే 67 టీఎంసీల నిల్వ కెపాసిటీని అందుబాటులోకి తెచ్చింది. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఉదయ సముద్రం ఇలా మొత్తం వందకు పైగా టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యాన్ని మేము కదా ఏర్పాటు చేసినం. పాలమూరుకు ఎన్నటికీ తీరని శాపం కాంగ్రెస్ పార్టీనే. దత్తత తీసుకున్నానని చెప్పి దగా చేసిన చరిత్ర చంద్రబాబుది’ అని మండిపడ్డారు.
‘కేసీఆర్ అంటే పచ్చని పంటలు, రేవంత్‌రెడ్డి అంటే పచ్చి అబద్ధాలు అని ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. పక రాష్ట్ర ముఖ్యమంత్రితో మర్యాదపూర్వక సంబంధాలు నిర్వహించినం. పక రాష్ట్ర ముఖ్యమంత్రి తరపున సూట్‌కేసులు మోయలేదు. ప్రజాభవన్‌లో కూర్చోబెట్టి పాదసేవ చేయలేదు. ఏపీ యథేచ్ఛగా రోజుకు 10 వేల క్యూసెకులు తరలించుకుపోతుంటే అడ్డుకోవాల్సింది పోయి, మా మీదే రంకెలా?’ అంటూ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి బీజేపీతో పగలు కుస్తీ.. రాత్రి దోస్తీ చేస్తున్నారని హరీశ్ ఎద్దేవాచేశారు. ‘ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనను సందర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను ఎందుకు ఆపారు? బీజేపీ నాయకులకు స్వాగతం ఎందుకు పలికారు? ఇప్పటివరకు ప్రమాదంపై బీజేపీ పల్లె త్తు మాట మాట్లాడలేద’ని చురకలంటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఎస్ఎల్బీసీ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హరీశ్ డిమాండ్‌చేశారు. ‘మీ రాజకీయ ప్రయోజనాల కోసం సాంకేతికపరమైన విషయాలను నిర్లక్ష్యం చేసి ఆదరబాదరాగా ఎస్ఎల్బీసీ పనులను చేసిండ్రు. కార్మికులు వద్దని వారిస్తున్నా వినకుండా వారిని మృత్యుకుహరంలోకి నెట్టి వారి ప్రాణాలు బలితీసుకొని ఇప్పుడు కుహనా ఏడ్పులు ఏడుస్తున్నరు. నీకు నిజాయితీ ఉంటే ఈ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించు!’ అని సవాల్ చే శారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3,900 కోట్లు ఖర్చు చేసి సొరంగాన్ని 11.48 కిలోమీటర్లు త వ్విన విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్న రు? నిధులు పెట్టకుండానే అన్ని కిలోమీటర్ల పనులు అయ్యాయా? మీ హయాం లో డిండి ప్రాజెక్టుకు రూపాయి పెట్టలేదు. అది నిజం’ అని హరీశ్ స్పష్టంచేశారు.