జనగామ, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): జనగామ మండలం పసరుమడ్లలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రసంగిస్తున్న సమయంలో కరెంట్ కోత విధించలేదని, ఆ సమయంలో సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడిందని ట్రాన్స్‌కో అధికారులు స్పష్టం చేశారు. ‘మార్పు మొదలైంది’ అనే శీర్షికన గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి ట్రాన్స్‌కో అధికారులు వివరణ ఇచ్చారు.
పసరుమడ్ల 11కేవీ 24 గంటల ఫీడర్లో హెచ్‌టీ ఎస్సీనం.జేజీఎన్ నుంచి 1265 కేవీఏ అదనపు లోడ్‌ను విడుదల చేసేందుకు ఈనెల 7న మధ్యాహ్నం 2.20 గంటల నుంచి 2.25 గంటల వరకు ఎల్సీ తీసుకోవడం వల్ల తొలుత 5 నిమిషాలపాటు, అభ్యుదయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫ్యూజ్‌లు ఊడిపోవడంతో తలెత్తిన సాంకేతిక సమస్యతో తిరిగి మధ్యాహ్నం 3.20 నుంచి 3.25 గంటల మధ్య సరఫరాలో అంతరాయం కలిగిందని జనగామ ట్రాన్స్‌కో డీఈ (ఆపరేన్) ఎం లక్ష్మీనారాయణరెడ్డి గురువారం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు.