Harish rao | ఇది శాసన సభనా.. లేక కౌరవ సభనా? మహిళా ఎమ్మెల్యేల చీరెలు లాగుతారా?ప్రజాప్రతి నిధులపై పోలీసులను ప్రయోగిస్తారా? ఎమ్మెల్యేలను మెడ పట్టి గెంటేస్తారా..ఇదేం రాజ్యం రేవంత్ రెడ్డి, పోలీ సు రాజ్యం నడుపుతున్నావా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాన్ని నిరసిస్తూ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరి గింది. మహళా ఎమ్మెల్యేలు అని చూడా కూండా జుట్టు పట్టి, చీరలాగి అమానవీయంగా ప్రర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే అన్నారు.
చీరెలు లాగిన పోలీసులను వదిలిపెట్టం
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, పింఛన్లు, ఫీజు రియింబర్స్ మెంట్, రైతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల గురించి అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడకుండా గొంతు నొక్కారు. వెయ్యి రోజుల విఫల పాలన వాస్తవాలు బట్ట బయలు అవుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం భయపడిందన్నారు. అందుకే మా పై పోలీసులను ప్రయోగించారు. అమానుషంగా, అమానవీయంగా సభ్యుల పట్ల ప్రవర్తించారు. మహిళా శాసనసభా నాయకుల చీరెలు లాగుతారా? మా పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? మా మహిళా సభ్యుల చీరెలు లాగిన పోలీసులను వదిలిపెట్టం అని హెచ్చరించారు.
సునితమ్మ చీర లాగిన పోలీసులను, సబితమ్మ గొంతు నొక్కిన పోలీసులను, జగదీష్ రెడ్డిని కింద పడేసిన వారినైనా సరే.. సప్త సముద్రాల అవల ఉన్నా వదిలిపెట్టమని హెచ్చరించారు. హాస్పిటల్కు కూడా తీసుకు వెళ్లకుండా అడ్డుకుంటారా? కేటీఆర్ చేయి గీరుకుపోయింది, ముఖం మీద గీరుకు పోయింది. యాదవ రెడ్డికి కుడి కాలు గోరు పోయింది. ఎమ్మెల్యేలు రాజశేఖ రెడ్డి కాలు కమిలి పోయింది, సంజయ్ చేయికి దెబ్బ తగిలింది. హోం మంత్రి, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి నువ్వు తగిన మూల్యం తప్పించుకోక తప్పదన్నారు. బిజేపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సంగ్ చేసుకొని 22ఎ మీద, ఫీజు రియంబర్స్మెంట్ మీద నామమాత్రపు చర్చ చేస్తారా? ప్రధాన ప్రతిపక్షం వద్దా అని నిలదీశారు.
రాహుల్ గాంధీ చేస్తే రైటా..
రాహుల్ గాంధీ, ప్రియాంక నల్ల టి షర్ట్స్ వేసుకొని పార్లమెంట్ కు వెళ్లారు. ఇక్కడ ఎందుకు అడ్డుకుంటారు. మేము ప్రజల తరుపున నిరసన తెలుపుతుంటే అడ్డుకుంటున్నారు. రేవంత్ రెడ్డి లాగా మేము బడివే అనలేదు, పైల్వాన్లు ఉన్నరు కొడుతరు అనలేదు. మేం మీ వైఫల్యాల గురించి ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలుపుతున్నాం. ప్రధాన ప్రతిపక్షం లేకుండా చర్చ జరుపుతాం అంటే ఈ ప్రభుత్వం పారిపోయినట్లేనని ఎద్దేవా చేశౠరు. మీరు తప్పు చేయకుంటే ఎందుకు ఎజెండాలో పెట్టడం లేదు. మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదు. విద్యార్థులు రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. వందలాది మంది వచ్చి వినతులు ఇస్తున్నరు.
బీజేపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్
ఉద్యోగాలు చేయలేక పోతున్నా, ఉన్నత చదవులకు వెళ్ల లేకపోతున్నాం అని ఆవేదన చెందుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసి, బీఆర్ఎస్ సభలో లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. పథకం ప్రకారం ఒక కుట్రతో వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని సస్పెండ్ చేయడానికి ఒక వ్యూహం ప్రకారం నడుచుకున్నారు. ఎన్ని కుట్రలు చేసినా 22ఎ, ఫీజు రీయింబర్స్ మెంట్ వైఫల్యాల గురించి వదిలిపెట్టం.
స్కాంలు, వైఫల్యాలు బయట పడుతాయనే ఇదంతా చేసారని విమర్శించారు. తొక ముడిచి పథకం ప్రకారం కుట్ర పన్నారు. మా చెల్లమ్మ గొంతు నొక్కితే చూస్తూ ఊరుకుంటారా? ఒక అక్క గొంతు పిసికితే చేతులు కట్టుకొని చూస్తూ ఉండాలా? ఇదేం ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. ప్రజల సమస్యల మీద చర్చ అంటే ప్రభుత్వం బయపడుతున్నది. ప్రజాక్షేత్రంలో ప్రజలే కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతారన్నారు.