Harish Rao | రాష్ట్ర ప్రజలకు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారదోలే వెలుగుల పండుగ దీపావళి (Diwali) కి హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యం ఉందని పేరొన్నారు. దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, పిల్లలు పటాకులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. లక్ష్మీనారాయణుడి అనుగ్రహంతో అందరికీ శుభం చేకూరాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్నారు.
Harish Rao | ఎన్నికలెప్పుడొచ్చినా బీఆర్ఎస్కు 100 సీట్లు గ్యారెంటీ.. రేవంత్..నీ కుర్చీ కాపాడుకో!