హైదరాబాద్: గురుకులాలకు అద్దెలు ఇంకెప్పుడు చెల్లిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో రోజురోజుకి దిగజారిపోతున్న విద్యావ్యవస్థ గురించి విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న మీరు ఇంకెప్పుడు పట్టించుకుంటారని నిలదీశారు. గత 10 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యజమాని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్కు తాళం వేశారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాల నిర్వహణ అద్వాన్న స్థితికి చేరుకున్నదనడానికి ఇది మరొక నిదర్శనమంటూ ఫైర్ అయ్యారు.
‘ప్రభుత్వం 10 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యజమాని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కు తాళం వేసిన దుస్థితి. కాంగ్రెస్ పాలనలో గురుకులాల నిర్వహణ అద్వాన్న స్థితికి చేరుకున్నదనడానికి ఇది మరొక నిదర్శనం. ముఖ్యమంత్రి గారు.. గురుకులాలకు అద్దెలు ఇంకెప్పుడు చెల్లిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రోజురోజుకి దిగజారి పోతున్న విద్యావ్యవస్థ గురించి విద్యా శాఖ మంత్రిగా కూడా ఉన్న మీరు.. ఇంకెప్పుడు పట్టించుకుంటారు?’ అని ట్వీట్ చేశారు.
ప్రభుత్వం 10 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యజమాని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కు తాళం వేసిన దుస్థితి.
కాంగ్రెస్ పాలనలో గురుకులాల నిర్వహణ అద్వాన్న స్థితికి చేరుకున్నదనడానికి ఇది మరొక నిదర్శనం.
ముఖ్యమంత్రి గారు.. గురుకులాలకు అద్దెలు ఇంకెప్పుడు… pic.twitter.com/qAxCOZ5Mmp
— Harish Rao Thanneeru (@BRSHarish) October 15, 2024