హైదరాబాద్ : బోధన, భోజనం కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao )ఫైర్ అయ్యారు. బోధన లేదు, భోజనం లేదంటూ.. కామారెడ్డి జిల్లా బీబీపేట(Bibipet) కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులలో కలిసి చేసిన ఆందోళనపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. నాణ్యమైన భోజనం, మౌలిక వసతుల కల్పనం కోసం విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుండటం శోచనీయం.
విద్యార్థుల ఫిర్యాదులు పరిశీలించి, వెంటనే వారి సమస్యకు పరిష్కారం చూపాలని, మెరుగైన బోధన, నాణ్యమైన భోజనం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. కాగా, బీబీపేటలోని కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు మంచి బోధన, భోజనం కోసం ఆదివారం ఆందోళన చేపట్టారు. మౌలిక వసతులు కల్పించాలని కోరితే ప్రధానోపాధ్యాయుడు మమ్మల్ని దూషిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఎం, వంట సిబ్బంది ప్రవర్తన సరిగా లేదని, వారిని సస్పెండ్ చేయాలని ఐదు గంటల పాటు ఆందోళన చేపట్టారు.
బోధన లేదు, భోజనం లేదంటూ..
కామారెడ్డి జిల్లా బీబీపేట కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులలో కలిసి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుండటం శోచనీయం.విద్యార్థుల ఫిర్యాదులు పరిశీలించి, వెంటనే వారి సమస్యకు పరిష్కారం చూపాలని, మెరుగైన బోధన, నాణ్యమైన భోజనం… pic.twitter.com/wlif3QzgLD
— Harish Rao Thanneeru (@BRSHarish) November 11, 2024