Harish rao | ఖమ్మంలో బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఆరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ స్పందించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సోమవారం బాన్సువాడ మాతా శిశు దవాఖానలో చికిత్స వికటించి, నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలింతలను హరీశ్‌రావు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం ఘటనలో మేము రాగానే సీతక్క, తుమ్మల వచ్చి హడావిడి చేశారు.
బాధిత బాలిక కూడా ఇంకా దవాఖానలో ఉండటంతో తనని కూడా పరామర్శించామన్నారు. ఆ అమ్మాయి పరిస్థితి బాగా లేదు.. తాను ఇంక నిలబడటం కష్టమే అని డాక్టర్లు చెబుతున్నారు. 8వ తరగతి చదువుతున్న బాలిక జీవితాంతం వీల్ చైర్ మీద ఎలా బతకాలి? ఆ అమ్మాయికి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి, వారి కుటుంబాన్ని ప్రభు ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఖమ్మంలో మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఆరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ స్పందించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు
మేము రాగానే సీతక్క, తుమ్మల వచ్చి హడావిడి చేసారు
ఆ అమ్మాయి కూడా ఇంకా ఆసుపత్రిలోనే ఉంది తనని కూడా పరామర్శించాము
ఆ అమ్మాయి పరిస్థితి బాగా లేదు.. తాను ఇంక నిలబడటం… https://t.co/RSQhs28b2Y pic.twitter.com/VsKg6Y5hH8
— Telugu Scribe (@TeluguScribe) July 20, 2026