సిద్దిపేట, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం .. ఈ ప్రాజెక్టు వల్లే సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగవుతున్నది. రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చాయంటే కారణం కాళేశ్వరం. కేసీఆర్ నిర్మించిన పాలమూరు, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల ఫలితంగానే తెలంగాణ ప్రాంతమంతా పామాయిల్ సాగుకు అనుకూలంగా మారింది. కష్టపడింది.. విత్తనం నాటింది బీఆర్ఎస్ అయితే పండ్లు తినడానికి మాత్రం కాంగ్రెస్ బయలుదేరింది. నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం వెనుక కష్టం ఎవరిది? చెమట చుకలు చిందించిందెవరనేది ప్రజలకు తెలుసు’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర పనికిరాని ఆరోవేలు వంటిదని చెప్పారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీ ట్రయిల్ రన్ విజయవంతమైన నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కసిలి హరీశ్ సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘అందరి దృష్టిలో ఇది ఫ్యాక్టరీ కావచ్చు కానీ మన దృష్టిలో ఇదొక ఎమోషన్..వేలాదిమంది రైతుల జీవితాల్లో గుణాత్మక మార్పు తెచ్చే, దశదిశను మార్చేది’ అని అభివర్ణించారు.
సాధ్యం కాదన్నచోటే..
సిద్దిపేటకు పామాయిల్ పంట తీసుకొద్దామని ప్రయత్నం చేసిన తొలినాళ్లలో ఐఐఓఆర్ (ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్) వారు 2018లో ఇకడ గాలిలో తేమశాతం తకువ ఉన్నది, సాగు సాధ్యం కాదని చెప్పారని గుర్తుచేశారు. 2019లో కాళేశ్వరం ్ర ద్వారా రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, చెరువులు, చెక్ డ్యాముల్లో నీళ్లు నింపుకొన్నామని, 2021లో పరిశోధన చేసిన తర్వాత మళ్లీ గాలిలో తేమ శాతం పెరిగిందని, ఇకడ పామాయిల్ సాగు చేసుకోవచ్చని ఐఐఓఆర్ ప్రకటించిందని గుర్తుచేశారు. 2022, జూన్ 5న రామచంద్రాపూర్‌లో రైతు మడుగు ఎల్లారెడ్డి మొదటి పామాయిల్ మొక నాటారని, ఒకో రైతును గుర్తించి ఒక్కో ఎకరం పెట్టించి ఇకడిదాకా వచ్చామని చెప్పారు. పామాయిల్ సాగుతో ప్రతినెలా జీతం పడ్డట్టు రైతుకు ఆదాయం వస్తుందని తెలిపారు. 2022 ఏప్రిల్‌లో ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని, మలేషియా టెక్నాలజీని తీసుకొచ్చి ఫ్యాక్టరీ ఏర్పాటు చేశామని చెప్పారు. కానీ ఇవ్వాల రేవంత్‌రెడ్డి రిబ్బన్ కత్తిరించేందుకు కత్తెర్లు జేబులో పెట్టుకొని బయలుదేరిండని ఎద్దేవాచేశారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, ప్రతి జిల్లాకు పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ పనులు.. కాంగ్రెస్ కటింగ్‌లు: పల్లా
బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం రిబ్బన్ కటింగ్‌లు చేసి తన ఖాతాలో వేసుకుంటున్నదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులపై గ్రామాల్లో రైతుల ముందు చర్చ పెట్టాలని చెప్పారు. 2014కు ముందు కాంగ్రెస్ 15 లక్షల ఎకరాల్లోనే వరి పండిస్తే బీఆర్ఎస్ వచ్చాక కోటీ 20 లక్షల ఎకరాలకు పెంచిందని గుర్తుచేశారు. విస్తీర్ణం, ఉత్పదకత, ఉత్పత్తి ఈ మూడూ కలిపి దేశంలోనే ఇవ్వాల వరి పండించే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచేందుకే కేసీఆరే కారణమని స్పష్టంచేశారు. ఇదంతా ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, 24 గంటల కరెంట్, సమయానికి ఎరువులు, విత్తనాలను అందించడం వల్లే సాధ్యమైందని గుర్తుచేశారు.