హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్‌గాంధీ తీసుకొచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
మీ మాటలను ఆచరణలో పెడతారా? లేదా? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రశ్నించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్ర కారం వ్యవహరించాలని మీరు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను కోరతారా? లేక రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోవడం కేవలం ఎన్నికల కోసం ఆడే నాటకమేనా?’ అని ఎక్స్ వేదికగా నిలదీశారు.