వ్యాపారులు అన్నివర్గాలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సింగరేణిలో బొగ్గు నిల్వలు లేకనే ఈ దుస్థితి వచ్చిందని స్పష్టంచేశారు. థర్మల్ కేంద్రాల్లో బొగ్గు లేదని బీఆర్ఎస్ చెబితే.. 40లక్షల టన్నుల బొగ్గు ఉన్నదని సర్కార్ బుకాయించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ తీరుతోనే విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయిందని ఆరోపించారు. కొత్తగూడెం, కాకతీయ, భద్రాద్రి, యాదాద్రి పవర్స్టేషన్లలో ఆరేడు రోజులకు మించి నిల్వలు లేవని, యాద్రాద్రి ప్లాంట్‌లో యూనిట్-1, 4లో బొగ్గు లేక, భద్రాద్రిలో నిర్వహణ వైఫల్యంతో ఉత్పత్తి నిలిచిందని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో కరెంట్ పోతే వార్త.. ఇప్పుడు ఉంటే వార్త అని చమత్కరించారు.
రాష్ట్రంలో కరెంట్ లోడ్ కేవలం 15వేల మెగావాట్లు మాత్రమేనని హరీశ్‌రావు స్పష్టంచేశారు. కానీ అసమర్థ సర్కార్ కరెంట్ సరఫరాలో విఫలమైందని మండిపడ్డారు. కరెంట్ కోతలతో 11 జిల్లాల్లోని రైతాంగం సబ్స్టేషన్ల ఎదుట ధర్నాలకు ఉపక్రమించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో 7,180 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా ఉత్పత్తి జరుగడం లేదని తెలిపారు. ‘బుధవారం కేవలం 3,190 మెగావాట్ల సామర్థ్యం మేర ఉత్పత్తి జరిగిందని, ఇది కేవలం 44శాతమే’ అని హరీశ్‌రావు విమర్శించారు.
సింగరేణి వైబ్‌సైట్‌ను మూసివేసి ఉత్పత్తి, సరఫరా, బొగ్గు నాణ్యత వివరాలు బయటకు రాకుండా చేశారు. నాణ్యమైన బొగ్గును తమిళనాడు, కర్ణాటక, ఏపీకి తరలిస్తున్నరు. రాష్ర్టానికి మాత్రం నాణ్యతలేని బొగ్గు ఇస్తున్నరు. 70 రేకులు నింపితే 30 రేకులు రిజెక్ట్ అవుతున్నందుకే థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి జరుగడం లేదు. రాష్ట్ర అవసరాలు పక్కనబెట్టి బొగ్గు ఎందుకు పంపిస్తున్నరు? మన దగ్గర బొగ్గు ఉన్నా పవర్ ఎక్సేంజ్‌లో ఎందుకు కొంటున్నరు? కేవలం 44శాతమే జనరేట్ చేయడంలోని ఆంతర్యమేంటి?
– హరీశ్‌రావు
ఇచ్చిన హామీలను ఎగ్గొడుతున్న కాంగ్రెస్ పెద్దలు కమీషన్లు మాత్రం దండిగా దండుకున్నారని హరీశ్‌రావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రప్రజలపై సోయి ఉన్నదా? కరెంట్, నీళ్లు ఇవ్వాలనే ధ్యాస ఉన్నదా? అని సూటిగా ప్రశ్నించారు.
అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డి.. సగం మంది రైతులకు చేసి మిగతావాళ్లకు ఎగనామం పెట్టారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సీజన్లకు సీజన్లే రైతుభరోసా ఇవ్వకుండా ధోకా చేశారని మండిపడ్డారు. చివరికి యూరియా, ఎరువుల సరఫరాలో దారుణంగా విఫలమయ్యారని దుమ్మెత్తిపోశారు.
సీతారామ ప్రాజెక్ట్‌ను నిర్మించిన ఘనత కేసీఆర్‌దేనని హరీశ్‌రావు స్పష్టంచేశారు. కేసీఆర్ పెట్టిన మోటర్లను కాంగ్రెస్ ప్రభుత్వం స్విచ్ ఆన్ చేసిందని విమర్శించారు. సీతారామ గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్‌కు లేదని తేల్చిచెప్పారు. దేవాదులను సైతం కట్టింది కేసీఆరేనని గుర్తుచేశారు.
నాడు గుండెలమీద చెయ్యి వేసుకొని నిద్రపోయిన రైతాంగానికి ఇప్పుడు కంటిమీద కునుకు కరువైంది. లో వోల్టేజ్‌తో మోటర్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం లాంటి సమస్యలతో రైతాంగం తల్లడిల్లుతున్నది. త్రీఫేస్ కరెంట్ కోసం పొలాల వద్ద జాగారం చేయాల్సి వస్తున్నది. కేసీఆర్ పాలనలో వెలుగులు విరజిమ్మిన రాష్ట్రంలో.. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి.
– హరీశ్‌రావు
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో 24గంటల నాణ్యమైన ఫ్రీ కరెంట్‌ను సరఫరా చేసి రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టామని హరీశ్‌రావు గుర్తుచేశారు. ప్రస్తుత రేవంత్ సర్కార్ అనాలోచిత చర్యలతో మళ్లీ చీకట్లలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. పల్లె, పట్నం అనే తేడాలేకుండా ఎక్కడా చూసినా కరెంట్ కోతలతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని.. ఇందిరమ్మ పాలన అంటే సమైక్య పాలనలోని కరెంట్ కష్టాలను మళ్లీ తీసుకురావడమేనా? అని నిలదీశారు. గంటల తరబడి కరెంట్‌లేక విద్యార్థులు కూడా రాత్రివేళల్లో చదువుకొనేందుకు ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.