గరీబీ హటావో అని ఇందిరాగాంధీ పిలుపునిస్తే ఫార్మాసిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుంచి కిసాన్ హటావో అని పిలుపునిస్తున్న రేవంత్‌రెడ్డి చర్యలే వికారాబాద్ ఘటనకు కారణమని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనకు ఐఏఎస్‌లు, ప్రభుత్వ అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఫార్మాసిటీ కోసం కేసీఆర్ హైదరాబాద్‌కు దగ్గరగా కాలుష్యం లేకుండా, జీరో వ్యర్థాలతో 15 వేల ఎకరాలు సేకరించి సిద్ధం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పర్యావరణం, అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చిన దాన్ని పకనపెట్టి పచ్చటి పొలాల్లో రేవంత్‌రెడ్డి ఫార్మా చిచ్చు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి మీద ఉన్న కోపాన్ని కొడంగల్ ప్రజలు ఆ జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారుల మీద చూపుతున్నారని, అంతేతప్ప అధికారులంటే ప్రజలకు కోపం ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.