కాంగ్రెస్ పార్టీ సభలు, బహిరంగ సమావేశాల్లో ఆరోపణలు చేయడం కాకుండా అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై చర్చకు రావాలి. రైతుబంధులో రూ.2వేలు పెంచారా? తగ్గించారా? అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుదాం. రుణమాఫీ కోసం రూ.35 వేల కోట్లు ఖర్చు చేశారా? రూ.20,041 కోట్లకే పరిమితమయ్యారా? మాట్లాడదాం. నిరుద్యోగులకు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? లెకలు తేల్చుదాం.
– హరీశ్‌రావు
సిద్దిపేట, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వాతంత్య్ర దినోత్సవం రోజున సాధారణంగా దేశాభివృద్ధి, రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం, స్వాతంత్య్ర సమరయోధుల త్యా గాలు, దేశ సమగ్రత వంటి అంశాలపై ముఖ్యమంత్రులు మాట్లాడుతారని, కానీ రేవంత్‌రెడ్డి ప్రసంగం మాత్రం రాజకీయ విమర్శలు, ఆరోపణలు, అబద్ధాలతో సాగిందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేత హరీశ్‌రావు విమర్శించా రు. శనివారం సిద్దిపేట క్యాంప్ కార్యాలయం లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సంగారెడ్డిలో సీఎం చేసిన వ్యాఖ్యలకు రికార్డులతో సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం చెప్తున్న లెకలకు, వాస్తవంగా ఖర్చు చేసిన నిధులకు మధ్య వ్యత్యాసం ఉన్నదని ఆరోపించారు. రైతు బంధు విషయంలో సీఎం వాస్తవాలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హ యాంలో రైతుబంధు కింద ఇచ్చిన మొత్తాల ను, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మొత్తాలతో పోల్చుతూ వాస్తవాలు వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో 2020-21లో రూ.14,65 6 కోట్లు, 2021-22లో 14,772 కోట్లు, 2022-23లో 14,743 కోట్లు రైతుబంధు కింద ఇచ్చామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024- 25లో కేవలం రూ.5,057 కోట్లు, 2025- 26లో రూ.11వేల కోట్లు ఇచ్చారని పేరొన్నా రు. రైతుబంధును రూ.2 వేలు పెంచి ఇస్తున్నామని చెప్తున్నారని.. అంటే కేసీఆర్ కంటే ఎకువగా ఇవ్వాలి కదా? అని ప్రశ్నించారు. రెండు ఆర్థిక సంవత్సరాల లెకలు కలిపి చూస్తే రూ.15 వేల కోట్లు తకువగా ఇచ్చారని.. ఈ లెకలు తప్పని సీఎం నిరూపిస్తే ముకు నేల కు రాస్తానని, సీఎం సిద్ధమా అని సవాల్ చేశా రు. గన్పార్ అమరవీరుల స్తూపం వద్దకు లెకలపై చర్చిద్దామని చెప్పారు. రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని విమర్శించారు. అసెంబ్లీలో రుణమాఫీ కోసం రూ.35 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పిందని, వాస్తవానికి 20,041 కోట్టే ఖర్చు చేశారని ఆరోపించారు. మరి మి గతా డబ్బు ఎకడికి వెళ్లిందని ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా పూర్తి రుణమాఫీ జరిగిందని నిరూపించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి ముందుగా గతంలో ఇచ్చిన హామీల అమలు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.
అసెంబ్లీలో ఒక మాట.. పబ్లిక్ మీటింగ్‌లో మరోమాట
అసెంబ్లీలో ఒక మాట.. పబ్లిక్ మీటింగ్‌లో మరో మాట ఉంటుందా? అని హరీశ్‌రావు నిప్పులుచెరిగారు. బీఆర్ఎస్ హయాంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదనడం వాస్త వ విరుద్ధమని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్ర భుత్వ హయాంలో 6,47,479 కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్టు అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ ఇచ్చిన సమాధానంలో పేరొన్నారని గుర్తుచేశారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అసెంబ్లీలో మీరే చెప్పి, సంగారెడ్డి సభలో ఇవ్వలేదని ఎలా చెప్తా రు? అని ప్రశ్నించారు. గత కాంగ్రెస్ పాలన లో ఒకరికి 4 కిలోల బియ్యం మాత్రమే ఇ చ్చారని, కుటుంబానికి 20 కిలోల పరిమితి ఉండేదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఆ పరిమాణాన్ని 6 కిలోలకు పెంచాడని తెలిపారు.
16వేల ఉద్యోగాలిచ్చి.. 70వేలని ఎలా చెప్తరు?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 16వేల ఉద్యోగాలు ఇచ్చిందని అసెంబ్లీలో తాను అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చి.. సం గారెడ్డి సభలో సీఎం మాత్రం 70వేలు ఉద్యోగాలిచ్చినట్టు ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు, నిరుద్యోగ యువతకు రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ హామీ నెరవేర్చనందుకు నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం సమాధానం చెప్పాలి
ప్రభుత్వ పనితీరుపైనే గాక అవినీతి, కమీషన్లపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని డిమాం డ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి, ప్రభుత్వ పనితీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అలాగే పోచారం, దానం నాగేందర్ తదితరుల వ్యాఖ్యలను కూడా ఆయన గుర్తుచేశారు.
పరువు నష్టం కేసు వేస్తా
సీఎం, ఇతర కాంగ్రెస్ నేతలు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తానని హరీశ్‌రావు హెచ్చరించారు. రైతుబంధు, రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, ఎరువుల సరఫరా, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ , ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.
24గంటల కరెంట్ ఇస్తే.. చూపించండి?
‘రైతులకు 24గంటల కరెంట్ ఎకడ వస్తుందో చూపించండి. ఏ సబ్ స్టేషన్‌కు పోదాం? నేను వస్తా.. లాగ్‌బుక్ చూపిస్తా’ అంటూ ముఖ్యమంత్రికి హరీశ్‌రావు సవాల్ చేశారు. సిద్దిపేట, మెదక్, నల్గొండ జిల్లాల్లో తాను సందర్శించిన సబ్స్టేషన్ల లాగ్‌బుక్‌ల ప్రకారం రైతులకు మూడు ఫేజ్‌ల 10 నుంచి 11గంటల విద్యుత్తు సరఫరా అవుతున్నదని తెలిపారు. రైతులు కరెంట్, యూరియా కోసం ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.