Congress Failure | (నమస్తే తెలంగాణ/స్పెషల్ టాస్క్ బ్యూరో): 1000 రోజుల రేవంత్ ప్రభుత్వ పాలనలో ఏమైంది? రాష్ట్రంలో ఎక్కడా తట్టెడు మట్టి ఎత్తలే. ఒక్క ఇటుకా పేర్చలే. కొత్త ప్రాజెక్టులు దేవుడెరుగు.. ఉన్నవాటినే పడావు పెట్టింది. అంతేనా, ప్రజాప్రయోజనాల దృష్ట్యా గత కేసీఆర్ ప్రభుత్వం వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించిన వాటికీ రిబ్బన్ కటింగ్ కూడా చేయలేని దురవస్థలో నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కునారిల్లుతున్నది.
వరంగల్‌లోని సెంట్రల్ జైలు స్థలంలో రూ. 1,100 కోట్ల వ్యయంతో 36 రకాల సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా 2021లో కేసీఆర్ ప్రభుత్వం 24 అంతస్తులతో ఈ హాస్పిటల్ నిర్మాణం చేపట్టింది. పనులు పూర్తైనా.. ప్రారంభానికి మాత్రం ఇంకా ఈ దవాఖాన నోచుకోలేదు.

Siddipet Hospital
సిద్దిపేట పట్టణంలో కేసీఆర్ ప్రభుత్వం వెయ్యి పడకల ఆస్పత్రి పనులను రాకెట్ వేగంతో పూర్తి చేసింది. ప్రభుత్వం మారి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ దవాఖాన ప్రారంభం కాలేదు.

Mahabubabad Police Commissi
16 ఎకరాల్లో రూ. 30 కోట్ల వ్యయంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ కార్యాలయ భవనాన్ని కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసింది. రేవంత్ ప్రభుత్వం ఇప్పటికీ ఈ కమిషనరేట్
భవనాన్ని ప్రారంభించలేదు.

Mahabubabad Medical Clg
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శనిగపురం రోడ్డులో రూ. 186 కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేసింది. కళాశాల సిద్ధంగా ఉన్నప్పటికీ, రేవంత్ ప్రభుత్వం ఇంకా ప్రారంభించట్లేదు.

Mahaboobnagar Hospital
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బస్‌స్టాండ్ ఎదురుగా వెయ్యి పడకలతో మల్టీస్పెషాలిటీ దవాఖానను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిచేసింది. దీని కోసం రూ.300 కోట్ల నిధులను ఖర్చు చేసింది. ఇప్పటికీ, ఈ దవాఖానను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించలేదు.

Yadadri Integrated Market
రూ. 8.5 కోట్ల నిధులతో కేసీఆర్ సర్కార్ 2020లో భువనగిరిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను నిర్మించింది. దాదాపుగా అన్ని పనులు పూర్తైనప్పటికీ, కాంగ్రెస్ప్రభుత్వం దీన్ని ప్రారంభించడంలేదు. అలాగే నల్లగొండలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తైనప్పటికీ, ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తీసుకురావడంలేదు.

Ghmc Market
హైదరాబాద్‌లోని నారాయణగూడలో 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3.04 కోట్ల అంచనాతో జీహెచ్ఎంసీ మార్కెట్ నిర్మాణానికి ప్రణాళికలు వేసి యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. కాంగ్రెస్ సర్కార్ మార్కెట్ సముదాయాన్ని ప్రారంభించకపోవడంతో ఇప్పుడు నిరుపయోగంగా మారింది.

Karimnagar Command Control
కరీంనగర్ శివారులోని మానేరు నది సమీపంలో రూ.54 కోట్ల అంచనా వ్యయంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కమాండ్ కంట్రోల్ భవనానికి శంకుస్థాపన చేసి పనులు పూర్తి చేశారు, కాంగ్రెస్ సర్కార్ దీన్ని ఇప్పటికీ వినియోగంలోకి తీసుకురావడం లేదు.

Adilabad It Tower
ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని బట్టిసావర్గా గ్రామంలో మూడెకరాల్లో రూ. 40 కోట్లతో కేసీఆర్ సర్కార్ ఈ ఐటీ టవర్‌ను నిర్మించింది. పనులెప్పుడో పూర్తైనప్పటికీ, ఇప్పటికీ రేవంత్ ప్రభుత్వం ఏవేవో కారణాలతో ఐటీ టవర్‌ను ఇప్పటికీ ప్రారంభించలేదు. దీంతో దాదాపు 7 వేల మంది ఉపాధికి దూరమయ్యారు.

Janagoan Medical Clg
రూ. 110 కోట్ల నిధులతో కేసీఆర్ ప్రభుత్వం జనగామ జిల్లా కేంద్రంలో 18 ఎకరాలను సేకరించి మెడికల్ కాలేజీ పనులను ప్రారంభించింది. దాదాపుగా అన్ని పనులు పూర్తైనా, ఇప్పటికీ ఈ కాలేజీని కాంగ్రెస్ సర్కార్ అందుబాటులోకి తీసుకురావడంలేదు. అలాగే అన్ని పనులు పూర్తయి సిద్ధంగా ఉన్నా జగిత్యాల మెడికల్ కాలేజీని రేవంత్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడంలేదు.

Karimnagar Collactorate
రూ.51 కోట్ల నిధులతో కేసీఆర్ ప్రభుత్వం 2021లో కరీంనగర్ కలెక్టరేట్ భవన పనులు ప్రారంభించింది. ఇప్పటికే దాదాపుగా అన్ని పనులు పూర్తైనా రేవంత్ ప్రభుత్వం ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావట్లేదు. అలాగే వరంగల్ కలెక్టరేట్ పనులు పూర్తైనప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ దీన్ని ప్రారంభించలేదు.

Mancherial Double Bedroom
మంచిర్యాలలోని రాజీవ్‌నగర్‌లోని రెండు ప్రాంతాల్లో రూ. 33 కోట్ల అంచనాతో 630 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టగా.. కేసీఆర్ హయాంలోనే 360 డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఇప్పటికీ, లబ్ధిదారులకు వాటిని పంపిణీ చేయలేదు. అలాగే మెదక్‌లోని డబుల్ బెడ్రూ మ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తై నా లబ్ధిదారులకు వాటిని పంపిణీ చేయడంలేదు.

Nakrekal Hospital
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ బస్‌స్టాండ్ సమీపంలో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో కేసీఆర్ ప్రభుత్వం రూ.32 కోట్ల వ్యయంతో వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలను నిర్మించింది. అన్ని హంగులతో దవాఖాన సిద్ధమైనా ఇప్పటికీ రేవంత్ ప్రభుత్వం ప్రారంభించలేదు.

Medak Narsapur Munsipality
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మున్సిపాలిటీ భవనం అన్ని హంగులతో సిద్ధమయ్యింది. అయినప్పటికీ, రేవంత్ ప్రభుత్వం ఇప్పటికీ దీన్ని ప్రారంభించలేదు.

Kothagudem Haritha
రూ.12.36 కోట్ల నిధులతో కేసీఆర్ హయాంలో లక్ష్మీదేవిపల్లి మండలం ఇల్లెందు క్రాస్‌రోడ్ వద్ద చకచకా పనులు పూర్తిచేసుకొన్న బడ్జెట్ హోటల్ హరిత కన్వెన్షన్.. ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. భద్రాద్రి జిల్లాలో అతి పెద్ద బడ్జెట్ హోటల్ ఉందంటే అది హరిత టూరిజం హోటలేనని చెప్పుకోవచ్చు.

Suryapet Mini Tankbund
రూ. 17 కోట్లు వెచ్చించి సూర్యాపేటలోని సద్దుల చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా కేసీఆర్ ప్రభుత్వం సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసింది. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికీ దీన్ని ప్రారంభించలేదు.