Revanth Reddy | ఎవరి మీద మీ బలనిరూపణ.. సీఎం రేవంత్ రెడ్డిని కడిగిపారేసిన అధిష్ఠానం?
Revanth Reddy | ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం గట్టిగానే తలంటినట్టు తెలిసింది. సొంత ప్రభుత్వంలోని బీసీ మహిళా మంత్రిపైనే ప్రతాపం చూపిస్తూ.. 17మంది ఎమ్మెల్యేలతో ఎవరి మీద మీ బలప్రదర్శన అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారని సమాచారం.
Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం గట్టిగానే తలంటినట్టు తెలిసింది. సొంత ప్రభుత్వంలోని బీసీ మహిళా మంత్రిపైనే ప్రతాపం చూపిస్తూ.. 17మంది ఎమ్మెల్యేలతో ఎవరి మీద మీ బలప్రదర్శన అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారని సమాచారం. ‘మీ బలాన్ని పార్టీ అధిష్ఠానానికి చూపించదలుచుకున్నారా?’ అంటూ కడిగిపారేసినట్టు తె లిసింది. టీపీసీసీ నుంచి గానీ, ఏఐసీసీ నుంచి గానీ ఎమ్మెల్యేలకు అనుమతి ఉన్నదా? అని నిలదీసినట్టు సమాచారం.
మంగళవారం ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్ ఒక్కరే నేరుగా వేణుగోపాల్ నివాసానికి వెళ్లి కలిశారు. ఇద్దరి మధ్య గంటపాటు చర్చలు జరిగాయి. విశ్వసనీయ స మాచారం ప్రకారం.. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖ వి వాదం, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ అం శాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. సురేఖ వివాదం ప్రస్తావనకు వచ్చిన వెం ట నే, ఎమ్మెల్యేలు సీఎల్పీలో మీడియా సమావేశం ఎందుకు పె ట్టాల్సి వచ్చిందని వేణుగోపాల్ అడిగినట్టు తెలిసింది.
సొంత ప్రభుత్వంలోని ఒక బీసీ మహిళా మంత్రిని టార్గెట్ చేస్తే, రేప్పొద్దున తాము దేశంలో బీసీల దగ్గరికి ఎలా వెళ్లగలమని? అని నిలదీసినట్టు తెలిసింది. సీఎంగా మీరు.. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు అనే భావన సరికాదని, ఇది తప్పుడు సంకేతాలు పంపుతాయని తీవ్రస్థాయిలో హెచ్చరించినట్టు తెలిసింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగా నే, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనలంటూ ముం దస్తుగా గందరగోళం సృష్టించడం వెనుక మతలబు ఏందని ప్రశ్నించినట్టు సమాచారం.
కొండాపై వేటుకు సీఎం పట్టు
మీరు ఎంటర్టైన్ చేయడంతో నే మంత్రులు ఎవరూ తన మాట వినటం లేదని కేసీ వేణుగోపాల్‌కు సీఎం రేవంత్ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తనకు ఫ్రీహ్యాండ్ ఇవ్వకపోతే పరిపాలన చేయలేనని మొరపెట్టుకున్నట్టు సమాచారం. కొండా సురేఖపై వేటు వేయాలని పట్టుబట్టినట్టు తెలిసింది. సురేఖ శాఖల్లో ఆమె కుమార్తె సుస్మితాపటేల్ మితిమీరి జోక్యం చేసుకొంటున్నారని చెప్తూ.. బదిలీలు, అనుమతుల మం జూరు వ్యవహారాల్లో ఆమె ప్రమేయానికి సం బంధించిన ఆధారాలను కేసీ వేణుగోపాల్ ముందుపెట్టినట్టు తెలిసింది.
గతంలో నటుడు అకినేని నాగార్జున కుటుంబంపై సురేఖ చేసి న వివాదాస్పద ఆరోపణల తాలూకు వీడియో క్లిప్పింగ్‌లను కూడా అందజేస్తూ.. ఆ వ్యవహారం కోర్టులకెక్కడం, పార్టీ పరువు బజారున పడేసిన తీరును వివరించినట్టు తెలిసింది. మాజీ ఓఎస్డీ సుమంత్ అడ్డగోలు దందాలు, అక్రమ వ్యవహారాన్ని మొత్తం ఆయన అధిష్ఠానం ముందు ఏకరువు పెట్టినట్టు తెలిసింది. ఆమెను తొలగించకపోతే తాను పరిపాలన చేయలేనని, సీనియర్ మంత్రులను తట్టుకోవడం కష్టమని వివరించినట్టు తెలిసింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సురేఖతోపాటు మరో ముగ్గురు మంత్రులపై తీవ్ర అభియోగాలు మోపినట్టు సమాచారం. వారిని కూడా మంత్రివర్గం నుంచి తప్పించాలని రేవంత్‌రెడ్డి ప్రతిపాదించినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

