హైదరాబాద్, డిసెంబర్8 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహిస్తున్నది గ్లోబల్ సమ్మిట్ కాదని, అది గోబెల్ సమ్మిట్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు దెప్పిపొడిచారు. 2047 డాక్యుమెంట్ సైతం చిత్తశుద్ధి లేని శివపూజలాంటిందని ఎద్దేవా చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమా వేశంలో హరీశ్ మాట్లాడారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న భూమి ఎక్కడిదని ప్రశ్నించారు. ఒక ఫార్మా హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దాలని, లక్షలాది మంది తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే కాంక్షతో 13వేల ఎకరాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలని కష్టపడి చేశామని వివరించారు.
కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆ భూమిని కమీషన్ల కోసం పప్పుబెల్లాలుగా పంచిపెడుతున్నదని నిప్పులు చెరిగారు. ‘ఆ భూమి సేకరణలో నీ ఒక్క చెమట చుక్క ఉన్నదా? ఆలోచన ఉన్నదా? గ్లోబల్ సమ్మిట్ పెట్టి గోబెల్స్ మాట్లాడినట్టు చేస్తున్నవ్.. దావోస్ కథ ఏమైంది. డొల్ల కంపెనీలతో ఎంవోయూ లు చేసుకున్నవ్. ఒక్క కంపెనీ రాలే. ఉద్యో గం రాలే. అంతా ఏమైందో తెలుసు. 2047 డాక్యుమెంట్ కూడా అంతే. గ్లోబల్ సమ్మి ట్ గురించి వివరంగా మరోసారి మాట్లాడుతా’ అని వెల్లడించారు. ‘ప్రాంతేతరులు ద్రోహం చేస్తే పొలిమేరలకు తరిమికొడుతం.. ప్రాంతంవాడే ద్రో హం చేస్తే పాతర పెడుతం’ అన్న కాళోజీ మాటలు రేవంత్‌రెడ్డికి వర్తిస్తాయని నిప్పు లు చెరిగారు. రేవంత్‌రెడ్డికి తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉన్నదని హరీశ్‌రావు హెచ్చరించారు.