కనకయ్యది సర్కార్ హత్యే.. రైతు మృతికి సర్కారే కారణం.. 45 రోజులుగా ధాన్యం కొనకుండా జాప్యం
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే నారాయణరావుపేట గ్రామ రైతు కనకయ్యను బలి తీసుకొన్నదని బీఆర్ఎస్ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. వడ్ల కొనుగోలులో జరుగుతున్న అవకతవకల వల్లే ఆ రైతు గుండె ఆగిందని ఆవేదన వ్యక్తంచేశారు. గుండెపోటుతో మృతిచెందిన రైతు పల్లెవేని కనకయ్య (గద్దర్ ) మృతదేహానికి శనివారం హరీశ్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు.
- తడిసిన వడ్లు కొనాలని ప్రాధేయపడితే 40 సంచులు కట్ చేశారు
- పంట అమ్ముకోవాలంటే రైతు కండ్లలో రక్తమొస్తుంది.. హరీశ్‌రావు ఆవేదన
- తొండల భాష…తొత్తరి భాష బంద్ చేయి రేవంత్
- రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పు
- పంట అమ్ముకోవాలంటే రైతు కండ్లలో రక్తమొస్తుంది
- బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించిన హరీశ్‌రావు
సిద్దిపేట, జూన్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే నారాయణరావుపేట గ్రామ రైతు కనకయ్యను బలి తీసుకొన్నదని బీఆర్ఎస్ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. వడ్ల కొనుగోలులో జరుగుతున్న అవకతవకల వల్లే ఆ రైతు గుండె ఆగిందని ఆవేదన వ్యక్తంచేశారు. గుండెపోటుతో మృతిచెందిన రైతు పల్లెవేని కనకయ్య (గద్దర్ ) మృతదేహానికి శనివారం హరీశ్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. కనకయ్య మృతి తనను తీవ్రంగా కలిచి వేసిందని, ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి, ఆర్థికసాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కనకయ్య వడ్లను మారెట్ యార్డులో దాదాపు 45 రోజులపాటు ఎవరూ కొనకుండా ఆలస్యం చేశారని చెప్పారు.
చివరికి వర్షం పడి ఆ వడ్లన్నీ తడిసిపోయాయని, ఆ తడిసిన వడ్లను మిల్లుకు తీసుకెళ్లి ప్రాధేయపడితే, నాలుగు ట్రాక్టర్ల వడ్లకు ఏకంగా 40 సంచుల ధాన్యాన్ని మిల్లర్లు తరుగు తీశారని చెప్పారు. ‘నా 40 సంచుల వడ్లు కట్ చేసిండ్రు’ అని శుక్రవారం రాత్రి వరకు తోటి రైతులతో, కుటుంబ సభ్యులతో బాధపడుతూ, ఆ టెన్షన్లోనే నిద్రలోనే ఆయనకు గుండెపోటు వచ్చి మరణించాడని చెప్పారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే అని మండిపడ్డారు. హైదరాబాద్‌లో కూర్చొని 80 శాతం 90శాతం వడ్లు కొన్నామని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారని, కానీ క్షేత్రస్థాయిలో ప్రతి ఊర్లో ఇంకా 30 నుంచి 40 శాతం వడ్లు పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. రైతుల ధాన్యంలో కోతలు పెడుతూ రైతుల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు.
రైతుల కండ్ల నుంచి రక్తమొస్తున్నది
రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో పంట పండించడం ఒక ఎత్తయితే.. ఆ పంటను అమ్ముకోవాలంటే రైతులకు కండ్లలో నుంచి రక్తం వచ్చే పరిస్థితి కనిపిస్తున్నదని హరీశ్‌రావు ఆరోపించారు. కుకునూరుపల్లి వద్ద ఒక రాజస్థాన్ లారీలో వడ్లు ఎకించే ప్రయత్నం చేస్తే, ఆ లారీ వడ్లతో సహా రాజస్థాన్ వెళ్లిపోయిందని తెలిపారు. దుబ్బాక మండలం చేర్వాపూర్‌లో సంచులు ఎత్తకపోవడం వల్ల, ఎన్సాన్‌పల్లిలో కొనుగోలు చేయకపోవడం వల్ల వడ్లు మొత్తం మొలకలొస్తున్నాయని చెప్పారు. మంత్రి దామోదర రాజనర్సింహ నియోజకవర్గమైన అల్లాదుర్గం మండలం వెంకటాపూర్‌లో ఇప్పటివరకు ఒక క్వింటా వడ్లు కూడా కొనలేదని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి క్షేత్రస్థాయి సమస్యలు వదిలేసి.. నేను మళ్లీ గెలుస్తా, తొకుతా, పండబెడుతా అంటూ తొండల భాష, తొత్తిరి భాష మాట్లాడుతున్నారు తప్ప.. రైతులకు ఏమి చేశారో? చెప్పడం లేదని మండిపడ్డారు. రెండు నెలలకు పైగా కల్లాల్లో వడ్లు పోసుకొని ఎదురుచూస్తున్న రైతుల గోస కనపడటం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, మాటలు కట్టిపెట్టి ఎలాంటి కోతలు లేకుండా యుద్ధప్రాతిపదికన వడ్లను తక్షణమే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

