హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట నీటిపారుదలశాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) హాజరయ్యారు. కమిషన్‌కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్.. హరీశ్‌రావును విచారిస్తున్నారు. ఇప్పటికే అన్నిదశల్లో విచారణ పూర్తిచేసిన కమిషన్.. ప్రస్తుతం రాజకీయ ప్రముఖులను విచారిస్తున్నది. ఇప్పటికే ఆర్థికశాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ప్రశ్నించిన విషయం తెలిసిందే.
అంతకుముందు కోకాపేటలోని తన నివాసం నుంచి తెలంగాణ భవన్ చేరుకున్న హరీశ్ రావు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. అనంతరం బీఆర్కే భవన్‌కు బయల్దేరారు. హరీశ్‌రావుకు మద్దతుగా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు.