హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం అత్యంత బాధాకరమని చెప్పారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వారి జీవితం ఆదర్శమని తెలిపారు. గోపినాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారి అకాల మరణం అత్యంత బాధాకరం. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారి మృతి బి ఆర్ ఎస్ పార్టీకి తీరని లోటు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వారి జీవితం ఆదర్శం. గోపినాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/llCKHWorzO
— Harish Rao Thanneeru (@BRSHarish) June 8, 2025
ఎమ్మెల్యే మాగంటి గోపీనాద్ మృతి పట్ల సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తీవ్ర దిగ్భంతిని వ్యక్తం చేశారు. ఆయన కన్ను మూసిన సమాచారాన్ని జీరించుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సార్లు శాసనసభ్యునిగా విజయం సాధించి ప్రధానంగా పేద, అణగారిన, మైనారిటీ వర్గాల సంక్షేమానికి నిరంతరం మాగంటి శ్రమించారని పేర్కొన్నారు. తనకు సుదీర్ఘ కాలంగా వ్యక్తి గత అనుబంధం ఉందని, నిస్వార్ధంగా సేవలు అందించి స్థానిక ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల మన్ననలను ఆయన పొందారని తెలిపారు. మాగంటి మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాగంటి అందించిన సేవలు చిరస్మరనీయంగా నిలుస్తాయని చెప్పారు.