హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు నెలల తరబడి కమీషన్‌ను చెల్లించకుండా వారి జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు చెలగాటం ఆడుతున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశా రు. మంగళవారం రేషన్ డీలర్లు తన నివాసంలో హరీశ్‌రావును కలిశారు. కాం గ్రెస్ ప్రభుత్వం తమకు చేసిన ద్రోహం గురించి ఆయనకు వివరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని వారు ఆయనను ఈ సందర్భంగా అభ్యర్థించారు. ఈ మేరకు స్పందించిన ఆయన అనంతరం మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రేషన్ డీలర్లు పస్తులుండే పరిస్థితులు దాపురించాయని చెప్పారు.
రేషన్ బియ్యం పంపిణీ కమీషన్‌ను కొన్ని నెలలుగా ఇవ్వకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. అభయహస్తం పేరిట విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో రేషన్ డీలర్లకు రూ.5 వేల గౌరవ వేతనంతోపాటు కమీషన్ పెంపు హామీని ప్రకటించారని, తీరా అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఆ హామీపై అతీగతీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు, కోతలకే పరిమితమైందని, ఇది చేతల ప్ర భుత్వం కాదని దుయ్యబట్టారు. 2014 లో మెట్రిక్ టన్నుకు రూ.200గా ఉన్న డీలర్ల కమీషన్‌ను బీఆర్ఎస్ హయాంలో రూ. 1,400కు పెంచినట్టు చెప్పారు. దీంతో బీఆర్ఎస్ హయాంలో 17వేలకు పైగా ఉన్న రేషన్ డీలర్ల ముఖాల్లో చిరునవ్వులు నింపామని తెలిపారు. డీలర్లకు కమీషన్ చెల్లించకుండా రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు దుర్మార్గపు వైఖరి ప్రదర్శిస్తున్నదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.