Telangana | పెన్పహాడ్, ఫిబ్రవరి 14: బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో నీటి తీరువాను రద్దు చేయగా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభు త్వం దానిపేరుతో రైతులను వేధిస్తున్నది. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం లింగాల గ్రామం చుట్టుపక్కల నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఎల్-27 మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 10 వేల ఎకరాల ఆయకట్టు సాగవుతున్నది. రైతులు లిఫ్ట్ కాల్వలకు మోటర్లు వేసుకుని పంటలు సాగు చేస్తున్నారు.
నీటి పన్ను కట్టలేదని శుక్రవారం లింగాల గ్రామంలో ఆరుగురు రైతులకు చెందిన మోటర్ స్టార్టర్ పెట్టెలను లష్కర్లు తీసుకెళ్లారు. భూములు నెర్రెలు పట్టి పొలాలు ఎండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్టర్లు తీసుకుపోవడం ఏమిటని రైతులు మండిపడుతున్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సొంత జిల్లాలోనే ఇలాం టి పరిస్థితి నెలకొనడం గమనార్హం.