జడ్చర్ల టౌన్, డిసెంబర్ 4 : గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికపై మహిళా వైస్ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. జడ్చర్ల మండలంలోని గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతున్న బాలికపై ఏడాదికాలంగా పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి వేధింపులకు గురిచేస్తున్నది.
గురుకులంలో నేరాలపై అవగాహన సదస్సుకు వచ్చిన షీటీం దృష్టికి బాలిక ఈ విషయం తీసుకెళ్లింది. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు విచారణ చేపట్టి వైస్ ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు నమోదుచేశారు.