హైదరాబాద్, ఏప్రిల్ 1 : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఏప్రిల్ 2న ఉగాది పర్వదినాన్ని ప్రజలందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆయన కోరారు. రెండు సంవత్సరాలు కరోనాతో బాధపడుతున్న ప్రజలకు ఇప్పుడు కొంత విముక్తి లభించిందన్నారు.
పండుగల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలు, మతాలను దృష్టిలో పెట్టుకొని సామరస్య నిర్ణయాలు తీసుకొంటుదన్నరు. శుభకృత్ నామ సంవత్సరంలో సబ్బండ వర్ణాలు, సంతోషాలు, మానవతా విలువలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.