చేనేత కార్మికుల పోరుబాట!.. ఈ నెల 25వ తేదీన ఇందిరాపార్క్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు ఏర్పాట్లు
ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ సర్కార్‌పై నిరసన గళం వినిపించేందుకు చేనేత కార్మికులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈ నెల 25న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు సన్నద్ధమవుతున్నారు.
- పెండింగ్ సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమైందని విమర్శ
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ సర్కార్‌పై నిరసన గళం వినిపించేందుకు చేనేత కార్మికులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈ నెల 25న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు సన్నద్ధమవుతున్నారు. ఈ ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా 25 వేల మందికి పైగా నేత కార్మికులు హాజరుకానున్నట్టు తెలిసింది. ఇప్పటికే అన్నివర్గాల నుంచి కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత పెరుగుతుండగా, తాజాగా చేనేత కార్మికులు సైతం ఆందోళన బాటకు సిద్ధమయ్యారు.
పోరాటంతోనే రుణమాఫీ..
ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామని చేనేత కార్మికులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత అనేక పోరాటాల అనంతరం రుణమాఫీ చేసింది. రుణమాఫీ మాదిరిగానే మిగిలిన సమస్యలను సైతం పోరాటాలతోనే సాధించుకోవాలని నేత కార్మికులు ముందుకెళ్తున్నారు. గత సర్కార్ నుంచే కొనసాగుతున్న చేనేత చేయూత పేరు మార్చి భరోసా పథకం తెచ్చారు. కానీ, ఇప్పటివరకు అమలు చేయడం లేదు. ఇక త్రిఫ్ట్ పథకంలో డిపాజిట్ చేసిన వారికి సర్కార్ రెండు నెలలు సపోర్టు చేసి ఆ తర్వాత ఎగనామం పెట్టింది.
బీమా సాయం అందలేదు..
జియోటాగ్ ఉండి మరణించిన నేత కార్మికుల కుటుంబాలకు ఏడాది గడిచినా బీమా డబ్బులు విడుదల చేయలేదు. సహకారోద్యమాన్ని తుంగలో తొక్కారు. సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. చేనేత పారిశ్రామిక సహకార సంఘం క్వాష్ క్రెడిట్ రుణాలను మాఫీ చేయని పరిస్థితి నెలకొన్నది. ఈక్రమంలో కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా నిర్వహించే మహాధర్నాకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు హాజరుకానున్నట్టు చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్ తెలిపారు. సమస్యలు పరిష్కారమ య్యే వరకు పోరుబాట వీడబోమని స్పష్టం చేశారు.
చేనేత కార్మికుల ప్రధాన డిమాండ్లు
- జియోటాగ్ ఉన్న చేనేత కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా నెలకు రూ.2వేలు, అనుబంధంగా ఇద్దరు కార్మికులకు రూ.500 చొప్పున మొత్తం రూ.36,000 చెల్లించాలి.
- త్రిఫ్ట్ పథకం బకాయిలను డిపాజిట్ చేయాలి.
- చేనేతల సమస్యల పరిష్కారం కోసం, టెక్స్‌టైల్‌కు మరో రూ.2వేల కోట్ల చొప్పున కేటాయించాలి
- 5 లక్షల ఆరోగ్య బీమా పథకం అమలుచేయాలి.
- జీరో వడ్డీతో రూ.5 లక్షల కొత్త రుణాలు ఇవ్వాలి.
- మరణించిన చేనేత కార్మికులకు షరతుల్లేకుండా నేతన్న బీమా అమలుచేయాలి.
- చేనేత సహకార సంఘాల క్వాష్ క్రెడిట్ రుణాల మాఫీతోపాటు కొత్త రుణాలివ్వాలి.
- చేనేత ముడిసరుకులైన నూలు, రంగులు, రసాయనాలు, చేనేత చీరలపై జీరో జీఎస్టీ వేయాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి.
- రద్దు చేసిన జాతీయ చేనేత బోర్డు, హ్యాండీక్రాఫ్ట్ బోర్డు, ఐసీఐసీఐ లాంబార్డ్ ఇన్సూరెన్స్ పథకం, మహాత్మాగాంధీ, బనకర్ యోజన, హాస్ కం వర్క్‌షెడ్ పథకాలను పునరుద్ధరించాలి.
- వర్క్ టు ఓనర్ పథకం పూర్తిచేసి అందించాలి.
- పవర్లూమ్ కార్మికులకు గుర్తింపుకార్డువ్వాలి.
- సర్కార్ నుంచి రావాల్సిన వస్త్ర పరిశ్రమ బకాయిలను వెంటనే చెల్లించాలి.
- ఇందిరమ్మ చీరలకు యారన్ సబ్సిడీని వెంటనే అందించాలి.
మహాధర్నాను విజయవంతం చేయాలి
రాజన్న సిరిసిల్ల, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : చేనేత, పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఈ నెల 25న నిర్వహించే మహాధర్నాకు కార్మికులు, యజమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ పిలుపునిచ్చారు. శనివారం సిరిసిల్లలోని బీవై నగర్ సీఐటీయూ జిల్లా కార్యాలయంలో మహాధర్నా కరపత్రాలు ఆవిష్కరించారు.
అనంతరం రమేశ్‌తోపాటు జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మాట్లాడారు. చేనేత, పవర్లూమ్ పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమ కోసం రూ.2 వేల కోట్లు కేటాయించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, భట్టి విక్రమార్కను కలిసి విన్నవిస్తే.. రూ.258 కోట్లు మాత్రమే కేటాయించి నేతన్నలకు తీవ్ర అన్యాయం చేశారని వాపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

