హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): చేనేత సంఘాలు అప్రమత్తంగా ఉండాలని చేనేత దినోత్సవం వ్యవస్థాపకుడు యర్రమాద వెంకన్న పిలుపునిచ్చారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. సర్కార్ తీసుకొచ్చిన టెండర్ విధానాన్ని రద్దు చేస్తూ.. గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 1 ప్రకారం ప్రభుత్వ సంస్థల అవసరాల నిమిత్తం కొనుగోలు చేసే వస్ర్తాలను టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చినట్టు తెలిపారు. ప్రభుత్వం తన పంతం నెగ్గించుకోవడానికి టెస్కో నుంచి నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ తీసుకొని టెండర్‌కు వెళ్లే ప్రమాదం ఉన్నట్టు పేర్కొన్నారు. తక్షణమే చేనేత సంఘాలు తమ వద్ద చేనేత ఉత్పత్తులు ఉన్నాయని టెస్కో ఎండీకి, హ్యాండ్లూమ్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖలు రాయాలని సూచించారు.