కర్ణాటక కాంగ్రెస్‌లో విస్తరణ చిచ్చు.. మంత్రి పదవి ఇవ్వలేదని ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
కర్ణాటక క్యాబినెట్ విస్తరణ వేళ అధికార కాంగ్రెస్‌లో అసమ్మతి చిచ్చు రాజుకుంది. క్యాబినెట్ విస్తరణలో తమకు చోటు దక్క లేదన్న అసంతృప్తితో సోమవారం ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యులు తమ శాసన సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 3: కర్ణాటక క్యాబినెట్ విస్తరణ వేళ అధికార కాంగ్రెస్‌లో అసమ్మతి చిచ్చు రాజుకుంది. క్యాబినెట్ విస్తరణలో తమకు చోటు దక్క లేదన్న అసంతృప్తితో సోమవారం ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యులు తమ శాసన సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. మంత్రివర్గంలో చోటు దక్కలేదని ఇండీ నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశ్వంత్రాయగౌడ, సాగర్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బేలూర్ గోపాలకృష్ణ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
తనకు మంత్రి పదవి ఇస్తానన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో పార్టీ విఫలమైందని పాటిల్ విమర్శించగా మాజీ ముఖ్యమంత్రుల పిల్లలకే కాంగ్రెస్‌లో ప్రాధాన్యత లభిస్తున్నదని గోపాలకృష్ణ ఆరోపించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకు డీకే మంత్రివర్గాన్ని విస్తరించారు. క్యాబినెట్లో 19 మందికి చోటు కల్పించారు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ నూతన మంత్రులతో ప్రమాణం చేయించారు. అసంతృప్త ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై డీకే స్పందిస్తూ, ‘ఇంత కుముందు సిద్ధరామయ్య క్యాబి నెట్లో నాకూ మంత్రి పదవి దక్కలేదు. అర్హు లైన వారు చాలామంది ఉన్నా..అందరికీ చోటు కల్పించలేం కదా!’ అని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

