Mandaadi | టాలీవుడ్ నటుడు సుహాస్, కోలీవుడ్ నటుడు సూరి ప్రధాన పాత్రల్లో, మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘మండాడి’. ప్రముఖ నిర్మాత ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మహిమా నంబియార్ కథానాయికగా నటించగా ప్రముఖ నటులు సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సెప్టెంబర్ 10న ఈ చిత్రం విడుదల కాబోతుండగా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని ‘యూ/ఎ’ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని, ముఖ్యంగా సముద్రం నేపథ్యంలో సాగే బోట్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు ఒళ్లు గగుర్పొడిచేలా, సరికొత్త సినిమా అనుభూతిని పంచేలా ఉన్నాయని సెన్సార్ సభ్యులు ప్రశంసించడం విశేషం. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఎస్.ఆర్. కథిర్ కెమెరా విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అంతేకాకుండా, పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ వంటి ప్రముఖ స్టంట్ మాస్టర్లు కంపోజ్ చేసిన హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమా స్థాయిని మరింత పెంచాయని యూనిట్ తెలిపింది.
ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలోనూ, ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షోలోనూ ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు గంటల వ్యవధిలోనే వందల, వేల సంఖ్యలో అమ్ముడవుతుండటం విశేషం. ఏపీ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి అత్యంత భారీ ఎత్తున విడుదల చేస్తోంది. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం, సుహాస్ మరియు సూరి ఇద్దరి కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించే చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.