జీవనదిలా మార్చింది కేసీఆరే.. కన్నెపల్లి పంపులను ఆన్‌చేసి జలాశయాలను నింపాలి
వరద కాలువను జీవనదిలా మార్చిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట వరదకాలువ వద్ద గల పంపుహౌస్‌ను ఆయన స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు.
- కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల డిమాండ్
- పంపుహౌస్ వద్ద కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
మెట్పల్లి రూరల్, ఆగస్టు 3 : వరద కాలువను జీవనదిలా మార్చిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట వరదకాలువ వద్ద గల పంపుహౌస్‌ను ఆయన స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఇటీవల పంపుహౌస్ నుంచి ఎత్తిపోసిన గోదావరి జలాలకు పూజలు చేసి, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు గ్రావిటీ ద్వారా నీళ్లు పోతున్నాయని ఓ కాంగ్రెస్ నాయకుడు అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎల్లంపల్లి కూడా కాళేశ్వరంలో ఒక భాగమేనని స్పష్టం చేశారు.
రాంపూర్, రాజేశ్వర్రావుపేట, ముప్కాల్ పంపుహౌస్‌ల ద్వారా వరదకాలువలో నీటిని ఎత్తిపోసి ఎస్సారెస్పీని నింపొచ్చని తెలిపారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 32 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, అన్నపూర్ణసాగర్కు వంటి జలాశయాల్లో నీళ్లు లేవని తెలిపారు. ఆగస్టు వచ్చినా నాట్లు పూర్తి కాలేదని, పలుచోట్ల నార్లు సైతం ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ నీళ్లు లేకపోయినా మేడిగడ్డ వద్ద ఏడాదంతా నీళ్లు ఉంటాయని, లక్ష్మీబరాజ్ వద్ద ప్రస్తుతం నాలుగు లక్షల క్యూసెక్కులు వృథాగా పోతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కన్నెపల్లి పంపుహౌస్ వద్ద నీళ్లు ఎత్తిపోసి జలాశయాలన్నీ నింపాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

