చిక్కడపల్లి, జూలై 8: దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు రూ.6 వేల పెన్షన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ దివ్యాంగుల సమైక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌కుమార్ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద సోమవారం మహాధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల హక్కుల చట్టం -2016ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఉచిత బస్సు సౌకర్యం కలిపించాలని డిమాండ్ చేశారు. ధర్నాంలో సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యుడు భిక్షపతి , ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్, రామకృష్ణ, శ్రీనివాస్, శిరీష, రషీద్, ప్రవీణ్‌కుమార్, ఊర్మిళ, విజయ్‌కుమార్, రాజేశ్వరి, గీత, ఉమారాణి పాల్గొన్నారు.