హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులు మాత్రమే నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగుతాయి. ఎస్సెస్సీ పరీక్షాకేంద్రాలున్న బడుల్లో మాత్రం మధ్యాహ్నం పూట స్కూళ్లను నిర్వహిస్తారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఈ నెల 15కు ముందుగానే ఒంటిపూట బడులు ప్రారంభించాలనే వినతులు వస్తున్నాయి.