అకాల నష్టం
రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో శనివారం వడగండ్ల వాన కురిసింది.చాలాచోట్ల పంటలు దెబ్బతిన్నట్టు రైతులు పేర్కొన్నారు.
- సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో వడగండ్ల వాన
- భారీగా దెబ్బతిన్న పంటలు.. రైతన్న కన్నీరు
- పంటచేతికొచ్చే దశలో నేలవాలిన వరి
వీర్నపల్లి/సిరికొండ, మార్చి 16: రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో శనివారం వడగండ్ల వాన కురిసింది.చాలాచోట్ల పంటలు దెబ్బతిన్నట్టు రైతులు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర, వన్పల్లి, గర్జనపల్లి, మద్దిమల్లలో వడగండ్ల వాన సుమారు గంటపాటు ఏకధాటిగా కురిసింది.
నిజామాబాద్ జిల్లా సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్పల్లి తదితర మండలాల్లో వడగండ్లు కురిశాయి. వడగండ్ల వాన సృష్టించిన బీభత్సానికి కోతకొచ్చిన వరి నేలవాలింది. రాళ్ల వాన ధాటికి ధాన్యం గింజలు రాలిపోయాయి. చేతికొచ్చిన పంటలు నష్టపోయిన రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షానికి నష్టపోయిన తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

