యాదాద్రి: శ్రీశ్రీరాధాకృష్ణజగన్నాధ మందిరం, అఖండ నామాశ్రమం ప్రధాన కార్యాలయం, అస్ట్రోవిజక్ కేంద్రాన్ని శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశ్వధర్మ పరిరక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శివస్వామిజీ పాల్గొన్నారు.
అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది మత పీఠాధిపతులతో సమావేశం ఏర్పాటు చేశామని అఖండ నామాశ్రమ ప్రధాన కార్యదర్శి శ్రీప్రసన్న కృష్ణదాస్ ప్రభూజీ తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వధర్మ పరిరక్షణ వేదిక బృందం తదితరులు పాల్గొన్నారు.