Gutha Sukender Reddy | మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.. సీఎం రేవంత్ కొత్తగా చేస్తున్నది ఏమీ లేదు: మండలి చైర్మన్ గుత్తా
ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అన్నిటిని రాజకీయ కోణంలో విమర్శించడం సమంజసం కాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును స్వాగతిస్తున్నానని చెప్పారు.
నల్లగొండ: ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అన్నిటిని రాజకీయ కోణంలో విమర్శించడం సమంజసం కాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును స్వాగతిస్తున్నానని చెప్పారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలోనే నదుల ప్రక్షాళనకు అడుగు పడిందన్నారు. కేసీఆర్ కూడా రివర్ ఫ్రంట్ పేరుతో ప్రణాళిక తీసుకొచ్చారని తెలిపారు. గత ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని చెప్పారు.
మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల కోసం నందనవనంలో గతంలోనే వేయికి పైగా ఇండ్లు నిర్మించి ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏదో చేస్తున్నట్టు వ్యతిరేక ప్రచారం చేయడం సరైనది కాదని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులు వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని వెల్లడించారు. అవసరమైతే మూసీ ప్రక్షాళన కోసం ఉద్యమానికి దిగాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

